పేదలను ఎప్పుడు అభద్రతతో ఉంచాలని కొందరి వ్యూహాత్మక అడుగులు. అందుకే వాళ్ళు ఎప్పుడు తగ్గి ఉండాలని కుట్రలు చేస్తున్నారు. అలా వాళ్ళు ఉంటేనే తమకు గడుస్తుంది, వాళ్ళు ఎప్పుడు తమ వద్దకు వచ్చి ఆ పని చేసిపెట్టండి, ఈ పని చేసి పెట్టండి అని అడుక్కొంటూనే ఉండాలనేది ఆయా ఉన్నత వర్గాల కోరిక. అందుకే వాళ్లకు దక్కే ప్రతి పధకం పై కేసుల వేటు వేస్తున్నారు. ఇలాంటి స్వభావం ఇంకా సమాజంలో ఉన్నదని ఇలాంటి పరిస్థితులలో బాహాటంగా తెలిసిపోతుంది. పేదవాడు ఎన్నటికీ అలాగే ఉంటేనే తాము గొప్ప వాళ్ళమని కొందరు అనుకోవడానికి బాగుంటుంది అనేది వాళ్ళ అభిమతం కావచ్చు. కానీ మారుతున్న సమాజంలో ప్రతి ఒక్కరు ఒక అడుగు ముందుకు వేయడానికే సిద్దపడుతున్నారు. అందుకు అవకాశం దొరికితే చాలు ప్రాణం పెట్టేస్తున్నారు. అలాంటి చోట కూడా ఎన్నో అడ్డంకులు ఏర్పాటు చేసే ప్రబుద్ధులు కూడా లేకపోలేదు, వారందరిని దాటుకొని ముందుకు వెళ్ళే ధైర్యం చేస్తున్నారు.

సమాజంలో కేవలం బలమైన వర్గాలు మాత్రమే అన్ని సౌకర్యాలు అనుభవించాలి అనే అభిప్రాయం ఇంకా కొందరిలో ఉండటం శోచనీయం. సాంకేతికత విస్తృతం అవుతున్న తరుణం, ప్రపంచీకరణ కు అందరు అలవాటుపడుతున్న తరుణం, తరతమ బేధాలు మరిచిపోతున్న తరుణం. అయినా ఇంకా పేద గొప్ప సమస్య మాత్రం పోవడం లేదు. పెద్దోళ్ళు, చిన్నోళ్లు అనే మీమాంశ అలాగే ఉంటుంది. ఇవన్నీ రేపటి  తరాలపై ప్రభావం చూపే అవకాశం చాలా ఉంది. అయినా పెద్దలు తమ మొండి పట్టుదల మాత్రం వీడటం లేదు. సజావుగా నడవాల్సిన సమాజంలో అసాంగిక శక్తులు తయారయ్యే విధంగా లేదా తయారు చేసే విధంగా వాళ్ళ చర్యలు ఉంటున్నాయి.  

ఏపీలో రాజధాని అని చెప్పిన అమరావతిలో పేదలకు ఇల్లు ఇవ్వడం పట్ల సామజిక సమతుల్యం దెబ్బతింటుంది అనేది కేసు వేయడం దానిపై న్యాయవ్యవస్థ విచారణ కూడా జరపడం లాంటివి ఆయా వర్గాలలో భేదాలను పెంచే సంఘటనలుగా మిగిలిపోతున్నాయి. తాజాగా ఓటిఎస్ విషయంలో కూడా అనేక గందరగోళాలకు ప్రజలను గురిచేయడం వాళ్లకు ప్రధాన లక్ష్యంగా మారిపోయింది. అయినా ప్రజలలో చైతన్యం ఉన్నది కాబట్టి, దాని వలన వాళ్లకు ప్రయోజనం ఉంటుంది అని గ్రహించారు కాబట్టి అటువైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే లక్షకుపైగా ప్రజలు దీనితో లబ్దిపొందినట్టు తెలుస్తుంది. అయితే ఇంతమంది దాని వైపు వెళ్లడాన్ని విపక్షాలు కానీ వారి అనుకూల మీడియా కానీ ఎంత  చిమ్ముతారు  అనేది వేచి చూడాల్సిన విషయం.

మరింత సమాచారం తెలుసుకోండి: