భారతదేశం అంతర్జాతీయ సమాజంలో వ్యూహాత్మక అడుగులు వేస్తూ పోతుంది. ఒక పక్క చైనా, మరో పక్క పాక్ ఎప్పుడెప్పుడు దేశంపై విరుచుకుపడాలి అని చూస్తున్న తరుణంలో ఆయా దేశాలతో భారత్ తగిన ఒప్పందాలు కుదుర్చుకుంటూ ముందుకు పోతుంది. అందులో ప్రస్తుత పరిస్థితికి తగ్గట్టుగా ఆయుధాల కొనుగోళ్ల ఒప్పందాలు కూడా ఉన్నాయి. రష్యా నుండి ఎస్400 లాంటి ఆయుధాలు, ఇజ్రాయెల్ నుండి అధునాతనమైన ఆయుధాల(గ్రూప్ డ్రోన్ సిస్టం-సామూహికంగా శత్రువుపై భీకర దాడి చేసేందు కోసం) కొనుగోలుకు మరో మూడు నెలలలో సిద్ధం కావడం లాంటివి భారత్ ప్రస్తుతం చేస్తున్న కార్యాచరణ. మిత్రులతో అడపాదడపా సమావేశాలు, వాటితో పాటుగా ఆయుధాల కొనుగోళ్ల ఒప్పందాలు చేసుకుంటూ, ప్రస్తుత పరిస్థితులకు తగిన విధంగా ప్రణాళికలకు తగ్గట్టుగా అడుగులు వేసుకుంటూ పోతుంది.

అలాగే వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్య ఒప్పందాలు కూడా జరుగుతున్నాయి. అంటే వాళ్లకు రక్షణ కావాల్సిన సమయంలో భారత్ సాయం చేస్తుంది, అలాగే భారత్ కు రక్షణ అవసరం అయిన సందర్భంలో వాళ్ళు సాయానికి రావాల్సి ఉంటుంది. ఇలాంటి ఒప్పందాలతో రేపటి రోజున యుద్ధం వచ్చినప్పటికీ, ఆయా దేశాల తో కలిసి శత్రువును త్వరగా మట్టికరిపించడానికి ప్రయత్నించాల్సి ఉంటుంది. సముఖిగా యుద్ధ భూమి లోకి వెళ్లడం ద్వారా అది మరోరకంగా తయారైనప్పటికీ, శత్రువును నిలువరించేందుకు తప్పని పరిస్థితి. స్వతహాగా ప్రయత్నిస్తూనే, ఇంకా ఎక్కడైనా చిన్నపాటి బలహీనతలు ఉంటె వాటిని పూడ్చుకోవడం ద్వారా మరింత బలం పుంజుకోవచ్చు.  ఆ దిశగానే భారత్ అడుగులు వేస్తుంది.

ప్రపంచం వెలివేసిన రెండు దేశాలు యుద్ధ భూమిలోకి వస్తే మిగిలిన వారు సహజంగానే ప్రత్యర్థులుగా ఉండటం జరుగుతుంది. కానీ అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదనే చందాన, ఆయా మిత్ర దేశాలతో భారత్ కలిసి ఒప్పందాలకు సిద్ధం అవుతుంది, అంటే దాదాపుగా ఆహ్వాన పత్రిక ఇస్తున్నట్టే. ఎప్పుడు యుద్ధం వచ్చినా భారత్ కు సాయం చేయాలని ఇప్పటికే ఒప్పందాలు ఉన్నాయి కదా అనైనా, కనీసం మొహమాటానికైనా సాయానికి రావాల్సిన అవసరం ఉందని, ఆయా దేశాలు ముందుకు వస్తాయి. అప్పుడు అది ఇంకా భీకర యుద్ధం(మూడో ప్రపంచ యుద్ధంగా) దారి మళ్ళిపోయే అవకాశాలు మెండుగానే ఉండొచ్చుగాక. కానీ ఈ స్నేహాలు చూసి, అసలు శత్రువులో యుద్దామనే భావనే అణగారిపోవచ్చు అనేది కూడా ఇక్కడ ఒక అంశం. ఇది వ్యూహంలో ఒక భాగమే.

మరింత సమాచారం తెలుసుకోండి: