తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలనేవి రోజుకు ఒక మలుపు తిరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ప్రస్తుతం వచ్చిన ఎమ్మెల్యే ఎలక్షన్లు చాలా రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఇందులో 70 శాతం ఓటర్లు టిఆర్ఎస్ సంబంధించిన వారు ఉన్నా, తెరాస పార్టీ మాత్రం గెలుపు ధీమా వ్యక్తం చేయడంలో  గట్టిగా చెప్పడంలేదు. అంటే దీనికి కారణం నేతల్లో ఉన్నటువంటి అసంతృప్తే.. మరి ఆ అసంతృప్తి ఎందుకు వచ్చిందో తెలుసుకుందామా..?

ఏడేళ్లుగా ఎదురులేకుండా దూసుకుపోతున్న తెరాసాకి దుబ్బాక ఉప ఎన్నికల్లో తొలి దెబ్బ తగిలింది. ఆ తర్వాత జిహెచ్ఎంసి ఎన్నికలు ఊహించని షాక్ ఇచ్చాయి. వెంటనే సాగర్ ఉప ఎన్నికల్లో విజయం కొరకు  ఎన్ని ఎత్తులు వేయాల్సి వచ్చిందో, మరెంత ఖర్చు చేయాల్సి వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో కేసీఆర్ తప్పులు చేస్తున్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అయితే ఈటెల ఎపిసోడ్ హుజురాబాద్ ఉప ఎన్నిక రెండూ కూడా  ఆయన చేతులారా చేసుకున్నవే తప్పించి ఇంకేవీ కావు. కాకపోతే ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ కు తిరుగులేదని ధీమాగా చెప్పుకున్న గులాబీ నేతలు ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. హుజురాబాద్ ఉప ఫలితం ఇచ్చిన షాక్ నుంచి ఇంకా తేరుకోకముందే వచ్చిపడిన ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పుడు కేసీఆర్ కు అగ్నిపరీక్షగా మారాయి. నివురుగప్పిన నిప్పులా ఉన్న ఈ పరిస్థితుల పై ఎవరూ స్పందించడానికి ఇష్టపడడం లేదు. అధికార పక్షంగా తమకు ఉన్న బలం, బలగంతో స్థానిక సంస్థల కోటా కింద జరిగిన  ఎమ్మెల్సీ స్థానాన్ని  సొంతం చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకూడదు. దీనికి కారణం ఓటర్లలో 70 శాతం మంది టిఆర్ఎస్ కు చెందిన వారే. కాకుంటే స్థానిక సంస్థల విషయం లైట్ తీసుకోవడం వల్ల కేసీఆర్ పై అక్కడి ప్రజా ప్రతినిధులు  గుర్రుగా ఉన్నారు. దీనికి తోడు ఈటెల ఎపిసోడ్ ఒకటి దీనికి తోడు అయింది. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు గా గెలిచిన వారిని కెసిఆర్ పట్టించుకోవడం, స్థానిక సంస్థల్ని బలపరిచే విషయంలో భారీ స్పీచ్ లు ఇచ్చే కేసీఆర్ వాస్తవంలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుండడం జరుగుతుంది. దీనితో స్థానిక సంస్థల సత్తా చాటాలన్న పట్టుదలతో ఉన్న వారి తీరును తెలుసుకున్న సీఎం కేసీఆర్ జిల్లా, మండల పరిషత్ అభివృద్ధికి తక్షణమే 250 కోట్లు విడుదల చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ను ఆదేశించినట్లుగా చెబుతున్నారు.


ఇదంతా చూస్తే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో కెసిఆర్ భయంగా ఉన్నట్లుగా చెప్పాలి. ఈ మధ్యన నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ తాము ఎన్నో ఎన్నికలను ఎదుర్కొన్నామని, గెలుపోటములు తమకు కొత్త కాదనీ చెప్పడం ఒక ఎత్తయితే పోతే ఒకటి, రెండు స్థానాలు పోతాయి దాన్నేమీ పట్టించుకోము అంటూ అన్యాపదేశంగా చేసిన వ్యాఖ్యల్ని వింటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తప్పదన్న దానిపై ఆయన కాస్త క్లారిటీతో ఉన్నారని చెప్పక తప్పదు. ఏదిఏమైనా ఒకప్పుడు ఎన్నికలంటే తమకు తిరుగులేదని భావించిన తెరాస వైఖరిలో క్రమంగా మార్పు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: