ఇటీవలే మందుబాబులు ఫుల్లుగా మద్యం సేవించిన తర్వాత కెసిఆర్ ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కెసిఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. అదేంటి కేసీఆర్ ప్రభుత్వం ఇటీవలే  మద్యం షాపుల సంఖ్యను  పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మొన్నటికి మొన్న ఏకంగా మద్యం ధరలు కూడా కాస్త తగ్గించింది . ఇలా మందుబాబులకు అనుకూలంగానే ప్రభుత్వం అన్ని పనులు చేస్తుంటే ఇక కెసిఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడం ఏంటి అని ఆశ్చర్య పోతున్నారు కదా.


 అయితే కేసీఆర్  తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన తెలిపిన మందుబాబులు తెలంగాణకు చెందిన వారు కాదు ఆంధ్రా కు చెందిన వారు. మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తున్న జగన్ ప్రభుత్వం మద్యం ధరలను భారీగా పెంచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సామాన్యులకు మద్యం ధరలు భారంగా మారి పోయాయ్. దీంతో మద్యం సేవించడానికి కూడా భయపడి పోతున్నారు. అదే  సమయంలో రెగ్యులర్ బ్రాండ్ కాకుండా కొత్త కొత్త బ్రాండ్ లను ఏపీ లో అమ్ముతున్నారు. అయితే ఇటీవలే  కాలంలో ఎంతోమంది సరిహద్దు ప్రాంతాల్లో ఏపీ నుంచి వచ్చి తెలంగాణలో మద్యం కొనుగోలు చేస్తూ ఉండటం గమనార్హం.


 గత కొన్ని రోజుల నుంచి ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో వింత పరిస్థితి ఏర్పడింది. ఏపీలో మద్యం ధరలు ఎక్కువగా ఉండటంతో చాలామంది తెలంగాణకు వచ్చి కొనుక్కో పోతున్నారు. ఇటీవల జోగులాంబ గద్వాల జిల్లా  కొల్లూరు లో ఉన్న వైన్ షాప్ వద్దకు కర్నూలు సమీప ప్రాంతాల ప్రజలు వచ్చారు ఈ క్రమంలోనే ఇక్కడే మద్యం సేవించారు. కానీ తిరిగి వెళ్లాలి అనుకున్న సమయంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడంతో మందు బాబులకు షాక్ తగిలింది. వైన్ షాప్ సమీపంలోనే టోల్ ప్లాజా వద్ద ఉండవెల్లి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. దీంతో ఆగ్రహానికి గురై కెసిఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు మందుబాబులు.

మరింత సమాచారం తెలుసుకోండి: