ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడుకు ఇంకా తత్వం బోధపడటంలేదు. తనకు అంత అనుభవం ఉంది ఇంత అనుభవం ఉందని చెప్పుకోవటమే కానీ ఆ అనుభవమేమీ అక్కరకు వస్తున్నట్లు లేదు. ఇందుకు తాజాగా జరుగుతున్న వ్యవహారమే ఉదాహరణగా నిలుస్తోంది. ప్రభుత్వం వన్ టైం సెటిల్మెంట్ (ఓటీఎస్) అనే విధానాన్ని పట్టుకొచ్చింది. 1983 నుండి 2011 వరకు ప్రభుత్వం ఇచ్చిన పట్టాల్లో గృహనిర్మాణశాఖ నుండి లోన్లు తీసుకుని ఇళ్ళు కట్టుకున్నవారికి సంబంధించిన పథకం ఓటీఎస్.

ఎప్పుడైతే ప్రభుత్వం ఓటీఎస్ పథకాన్ని తెచ్చిందో అప్పటినుండి చంద్రబాబు అండ్ కో రెచ్చిపోతున్నారు. ప్రతిరోజు లబ్దిదారులను ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొడుతు పదే పదే ఓటీఎస్ పథకానికి డబ్బులు కట్టదని చెబుతున్నారు. నిజానికి ప్రభుత్వం చెప్పేదాంట్లో కాస్త రీజనుంది. అదేమిటంటే ప్రభుత్వం ఇచ్చే పట్టాలు తీసుకుని గృహనిర్మాణ శాఖ దగ్గర అప్పు తీసుకుని కట్టుకున్న ఇళ్ళకు లబ్దిదారులు పాక్షికంగా ఓనర్లవుతారే కానీ నూరుశాతం కారు.

తాముంటున్న ఇళ్ళను బ్యాంకుల్లో తనఖా పెట్టుకోవాలని వెళితే బ్యాంకులు తిరస్కరిస్తున్నాయి. ఎందుకంటే ఆ ఇళ్ళు లబ్దిదారుల పేర్లతో లేకపోగా అప్పు ఉన్నట్లు బ్యాంకుల్లో కనబడుతున్నాయి. ఎంతకాలమైనా లబ్దిదారులు ఆ ఇళ్ళల్లో ఉండచ్చు. అంతేకానీ బ్యాంకుల్లో తనఖా పెట్టాలంటే పనికిరాదు. అమ్మాలంటే అమ్ముకోవచ్చు కానీ కొనేవాళ్ళు ధైర్యంచేస్తేనే అమ్మగలరు. ఎందుకంటే ఇంటిని కొనుగోలు చేసిన వారికి కూడా ఆ ఇంటిపై ఎలాంటి హక్కులుండవు.

క్షేత్రస్ధాయిలో సమస్యను గమనించిన ప్రభుత్వానికి ఎలాగూ నిధులు అవసరం కాబట్టి ఓటీఎస్ పథకాన్ని పట్టుకొచ్చింది. ఈ పథకంలో లబ్దిదారులు ప్రభుత్వం చెప్పినట్లుగా డబ్బులు కట్టేస్తే లబ్దిదారుల పేర్లపైనే ప్రభుత్వం ఇళ్ళను రిజిస్టర్ చేసిచ్చేస్తుంది. ఒకసారి సంపూర్ణంగా ఇళ్ళకు హక్కుదారులైతే ఆ ఇంటిని లబ్దిదారులు బ్యాంకుల్లో తనఖా పెట్టుకోవచ్చు లేదా దర్జాగా ఎవరికైనా అమ్ముకోవచ్చు. ఈ పథకం వల్ల ఇటు ప్రభుత్వానికి నిధులూ వస్తాయి. అటు లబ్దిదారులకు సంపూర్ణ హక్కులూ దక్కుతాయి.

ప్రభుత్వమేమో ఈ పథకం ఐచ్చికమంటోంది. ప్రతిపక్షాలు ముఖ్యంగా చంద్రబాబు అండ్ కో మాత్రం ఇదంతా ప్రభుత్వం నిర్బంధంగా చేస్తోందంటు గోల పెడుతున్నారు. మధ్యలో కిందస్ధాయి ఉద్యోగులు అక్కడక్కడ పథకంలో డబ్బులు కట్టడానికి సంక్షేమపథకాలకు లింకు పెడుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పథకం అమలులో సమస్యలుంటే ప్రభుత్వం-లబ్దిదారులు చూసుకుంటారు. ప్రభుత్వంపై కడుపుమండిన లబ్దిదారులే ప్రభుత్వంపై తిరగబడతారు. అప్పుడు ప్రతిపక్షాలు ఎంటరైనా అర్ధముంది.

అంతేకానీ చంద్రబాబు అండ్ కోనే లబ్దిదారులను రెచ్చగొడుతుంటే ప్రభుత్వం జాగ్రత్తపడుతోంది. కడుపునొప్పి ఉన్నవాడే మందేసుకోవాలి. అంతేకానీ ఒకరికి కడుపులో నొప్పిగా ఉందని మరొకడు మందు వేసుకంటే నొప్పి తగ్గదు. ఇక్కడ లబ్దిదారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపైకి రావాలి, అంతవరకు చంద్రబాబు వెయిట్ చేయాలి. అంతేకానీ చంద్రబాబే వాళ్ళని రెచ్చగొడితే రోడ్లపైకి వస్తారా ? ఒకవేళ పథకం నిజంగానే మంచిదనుకుంటే లబ్దిదారులు అసలు చంద్రబాబును పట్టించుకోరు కదా. ఎందుకు చంద్రబాబు తొందరపడుతున్నారో అర్ధం కావటంలేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: