ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు పూర్తయింది. 2014లో రాష్ట్ర విభజన జరిగి ఏడున్నర సంవత్సరాలు అవుతోంది. ఈ ఏడున్న‌ర‌ సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ అప్పు రోజు రోజుకు పెరిగిపోతోంది. ఏపీ తీవ్ర‌మైన‌ అప్పుల ఊబిలో కూరుకు పోతుంది. ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఏకంగా రు. 2 లక్షల కోట్ల అప్పు చేశారని ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

ఎన్ని అప్పులు చేసిన కూడా జగన్ అభివృద్ధిపై దృష్టి పెట్టడం లేదని... కేవలం సంక్షేమం పేరుతో జగన్ ప్రజల అకౌంట్లోకి డబ్బులు జమ చేస్తూ వెళ్ళిపోతున్నారన్న‌ విమర్శలు కూడా ఉన్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మరో ఐదారు నెలల్లోనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి ఉండదని చెబుతున్నారు. ఈ క్రమంలోనే రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఇప్పుడు ఆసక్తిగా మా రింది.

టిడిపి రాజ్యసభ సభ్యుడు క‌న‌క‌మేడల ర‌వీంద్ర కుమార్ వేసిన ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ ఇచ్చి న సమాధానం ఇప్పుడు వైరల్ గా మారింది. ఎస్.బి.ఐ. నుంచి 11,397 అప్పు - బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి 10,865 కోట్ల రుణం - బ్యాంక్ ఆఫ్ ఇండి యా నుంచి ఏడు వేల కోట్లు - బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి 4 సంస్థలకు 2,970 కోట్లు - కెనరా బ్యాంకు నుంచి 4,099 కోట్లు - పంజాబ్ సింధ్ బ్యాంకు నుంచి 750 కోట్లు రుణం తీసుకున్నట్లు ఆయ‌న చెప్పారు.

ఇండియన్ బ్యాంకు నుంచి 5,500 కోట్లు - ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుంచి 1,750 కోట్లు - పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి 5,633 - యూనియన్ బ్యాంకు నుంచి 6,975 కోట్లు తీసుకున్నారు. మొత్తంగా రు. 50 వేల కోట్ల అప్పులు జ‌గ‌న్ వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: