తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ వెన్నుదన్నుగా ఉంటూ వచ్చే కమ్మ సామాజిక వర్గం గత ఎన్నికల్లో చాలా వరకు జగన్‌కు సపోర్ట్ చేసింది. చంద్రబాబు తీరుతో విసిగి పోయిన చాలామంది క‌మ్మ‌ నేతలతో పాటు.. కమ్మ ప్రజలు సైతం 40 శాతం వరకు జగన్‌కు సపోర్ట్ చేశారు. పశ్చిమ గోదావరి - కృష్ణ - గుంటూరు జిల్లాలో మెజార్టీ వర్గాలు జగన్‌కు జై కొట్టడంతో జగన్ ఉన్న నియోజకవర్గాల్లో సైతం విజయం సాధించారు.

ఇక కమ్మ సామాజిక వర్గం నుంచి వైసీపీ తరఫున కొడాలి నాని - వసంత కృష్ణ ప్రసాద్ - కొఠారు అబ్బయ్య చౌదరి - నంబూరి శంకర్రావు - అన్నాబత్తుని శివకుమార్ - బొల్లా బ్రహ్మనాయుడు లాంటి నేతలు కూడా విజయం సాధించారు. జగన్ కూడా తన క్యాబినెట్ లో కమ్మ సామాజిక వర్గం నుంచి ఫైర్ బ్రాండ్ గా ఉన్న కొడాలి నాని కి మంత్రి పదవి ఇచ్చారు. అయితే ఇప్పుడు కొడాలి నాని, వంశీ లాంటి వారు ప్రధానంగా చంద్రబాబును టార్గెట్ చేస్తూ వస్తున్నారు.

గతంలో ఎన్టీఆర్ క‌మ్మ వర్గంలో ఐకాన్ గా ఉండేవారు. ఇప్పుడు చంద్రబాబు తానే కమ్మ‌లకు ఐక్యంగా ఉండాలని అనుకుంటున్నారు. తాజాగా జరిగిన పరిణామాల నేపథ్యంలో వైసీపీలో ఉండే కమ్మ నేతలను ఆ సామాజిక వర్గానికి దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాదు... పక్క రాష్ట్రంలో కూడా చంద్రబాబు - భువనేశ్వరి అంశం కమ్మ సామాజిక వర్గంను బలంగా కదిలించింది. అంటే ఈ చర్చ ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం అవుతోంది.

జగన్ అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్లో క‌మ్మలు బాగా ఇబ్బంది పడుతున్నారు అన్న‌ది వాస్తవం. దీనికి తోడు చంద్రబాబును తిట్టేందుకు కూడా ప్రధానంగా క‌మ్మ‌ల‌ను ప్రయోగిస్తున్నారు. వారు కూడా రెచ్చిపోయి మరి విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్మలు అందరూ కూడా ఏకమై వైసిపి లో ఉన్న క‌మ్మ నేతలను బహిష్కరణ చేసే వరకు వచ్చిందని అంటున్నారు. మరి ఇది ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: