తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పరిస్థితి నాడు.. నేడు చూస్తే.. గ‌తంలో ఢిల్లీ వెళ్లి బిజెపి ని కలిసి మేమంతా ఒక్కటే అని ప్రచారం చేసి.. హుజురాబాద్ ఎన్నికల ముందు ఒక ఫీల్‌ను క్రియోట్ చేశారు. కానీ అది బెడిసి కొట్టింది. తెలంగాణ బీజేపీ ఆ ప్ర‌చారాన్ని బ‌లంగా తిప్పికొట్టింది. ఈ విష‌యంపై బీజేపీ అధిష్టానం న‌ష్ట నివార‌ణ చర్యలు చేపట్టింది. తెలంగాణ విమోచన దినోత్సవం నాడు ఒక మిషతో సభ పెట్టిన అక్కడ ఈటెల రాజేందర్ నివేదికపై ప్రజలకు పరిచయం చేసి నానా పాట్లు పడితే గాని కేసీఆర్ ఇచ్చిన ఝలక్ నుంచి బయటపడలేక పోయారు.



 ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ అదే దెబ్బ కాంగ్రెస్ కొట్టాలని చూస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఢిల్లీలో జ‌రిగిన‌ విపక్షాల ఆందోళనకు త‌న మ‌ద్ధ‌తు తెలిపాడు సీఎం కేసీఆర్‌. కాంగ్రెస్‌తో  కలిసి టీఆర్ఎస్ ఎంపీలు వెళ్లి నిరసన తెలిపారు. మ‌ళ్లీ సేమ్ కార్డ్ కానీ, పేర్లు మాత్ర‌మే వేరు అన్న‌ట్టు బీజేపీ స్థానంలో కాంగ్రెస్ పేరు వ‌చ్చింది.  దీంతో ఢిల్లీ టీఆర్ఎస్‌, కాంగ్రెస్ ఒక్క‌టే అని వాళ్లంతా దొంగ‌లు అంటూ రాష్ట్ర బీజేపీ ప్ర‌చారం మొద‌లుపెట్టేసింది. ఇప్ప‌టికే హుజురాబాద్ దెబ్బ‌తో కాంగ్రెస్ పార్టీ బొక్కా బోర్లా ప‌డి మ‌ళ్లీ తిరిగి లేవ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తోంది.


 అదే స‌మ‌యంలో బీజేపీ పై ఎదురుదాడి చేస్తూ.. కేసీఆర్‌పై పోరాటానికి రేవంత్ ముంద‌డుగు వేస్తున్నారు.  ఈ క్ర‌మంలో టీఆర్ఎస్‌-కాంగ్రెస్ ఒక‌టే అనే భావ‌న తెలంగాణ ప్ర‌జ‌ల్లో వ‌చ్చిందంటే ఇన్నాళ్ల త‌మ పోరాటం, శ్ర‌మ వృథా అవుతుంద‌ని రాష్ట్ర కాంగ్రెస్ నేత‌లు ఆందోళ‌న చెందుతున్నారు. దీంతో ఒక సారి కేసీఆర్‌ను న‌మ్మి మోస‌పోయాం మ‌ళ్లీ న‌మ్మొద్ద‌ని ఢిల్లీ హైకామాండ్‌కు చెబుతున్నారు. అంతేకాదు, ఢిల్లీలో బీజేపీ వ్య‌తిరేకంగా టీఆర్ఎస్ మ‌ద్ధ‌తు తీసుకుంటే అది అక్క‌డి వ‌ర‌కే ప‌రిమితం చేయాల‌ని కోరుతున్నార‌ట‌. ఈ నేప‌థ్యంలో ఈ విషయాన్ని ఎలా ఎదుర్కొవాల‌ని రాష్ట్ర కాంగ్రెస్ నేత‌లు యోచిస్తున్నార‌ని తెలుస్తోంది.






మరింత సమాచారం తెలుసుకోండి: