కరోనా ప్రభావం అగ్రనేతలకు గండాన్ని మిగులుస్తుంది. ఆరంభం నుండి ఈ వైరస్ వలన అమెరికా లో కూడా ఇబ్బందులు తప్పలేదు. ఒక్కసారిగా అతలాకుతలం అయిపోయింది. ఇలాంటి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఆర్థిక పరమైన సంక్షోభాలు ఎదురవుతాయి. ఒక దేశం ఆర్థికంగా సుస్థిరంగా ఉండాలి అంటే, ముందు అక్కడ ప్రజలు పన్నుల రూపేణా కొంత చెల్లించాల్సి ఉండటం సహజం. కానీ ఈ సంక్షోభం తెచ్చిన తిప్పలతో లాక్ డౌన్ లాంటి చర్యలు చెప్పటాల్సి వచ్చింది. తద్వారా ఆర్థికనష్టం ఎవరికైన తప్పదు. రోజుకు వంద సంపాదించేవారికి వందే నష్టం, నిముషానికి వెయ్యి సంపాదించే వాళ్లకు ఆ సమయంలో ఎంత నష్టం అనేది చూస్తే ఆర్థికంగా ఎంత నష్టపోయింది అర్ధం చేసుకోవచ్చు. ఇక సంస్థల విషయం చెప్పాల్సిన పనిలేదు.

సంస్థలు పూర్తిగా మూసివేయబడటం, అందులోను లాక్ డౌన్ తరువాత పరిణామాలుగా ఉద్యోగులను వీలైనంత తగ్గించుకుపోవడం లాంటివి ఆర్థికపరమైన, సామజిక పరంగా బాగా ప్రభావం చూపాయి. దీనితో సహజంగానే ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకత పెరిగిపోతుంది. దానికి తోడుగా ధరల పెంపు తప్పనిసరి అవుతుంది. అదొక కారణంగా ఇలా, వచేకొద్దీ ప్రజలలో ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత పెరుగుతూనే పోతుంది. దీనిని అదుపుచేయడం సాధ్యమైన పని కాదు, అసలు ఇంకా అక్కడ కరోనా ప్రభావం పెద్దగా తగ్గిన దాఖలాలు కూడా లేవు. ఇంకా చెప్పాలంటే ప్రస్తుతం మరోసారి తీవ్రతరం అవుతుంది అక్కడ కరోనా సంక్షోభం.

ఇలాంటి పరిస్థితులలో కొత్తగా ఏర్పాటు చేసిన బైడెన్ ప్రభుత్వం వీటన్నిటికీ పరిష్కారం కనుగొనలేకపోతుంది. గత ప్రభుత్వంపై బైడెన్ చేసిన ఆరోపణలను ఇప్పుడు ఆయనే ఎదుర్కోవాల్సి వస్తుంది.  అందులో కీలకంగా బైడెన్ విఫలం అయ్యాడని అక్కడ 77 శాతం మంది వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం వలన తాము బాగా ఇబ్బంది పడుతున్నట్టుగా వాళ్ళు చెపుతున్నారు. 51 శాతం వాళ్ళు మాత్రం తాము సెలవులలో కూడా ఏమి కొనాలని అనుకున్నప్పటికీ, వాటిని కొనే స్థితి లేదని అందుకు బైడెన్ ప్రభుత్వ విధానాలే కారణం అని విమర్శిస్తున్నారు. ఇదంతా ఇలాగె కొనసాగితే ప్రభుత్వ మార్పుకు దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బైడెన్ వర్గాలు మాత్రం గతప్రభుత్వ విధానాల ఫలితాలు ఇప్పటికి అనుభవిస్తున్నట్టుగా సమర్ధించుకుంటున్నారు. ప్రతిపక్షం కూడా ప్రజావాణితో కలిసిపోవడం సహజం, అదే అక్కడా కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: