ఆంధ్రప్రదేశ్లో అధికార వైసిపి వర్సెస్ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల మధ్య రాజకీయ విమర్శలు వేడెక్కాయి. ప్రతి రోజు ఏదో ఒక విషయంలో రెండు పార్టీల నేతలు తీవ్రమైన విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ వస్తున్నారు. వారం రోజుల క్రిందట వరకు అసెంబ్లీలో నారా భువనేశ్వరి అంశం ప్రస్తావనకు రావడం చంద్రబాబు ప్రెస్‌మీట్లో కన్నీళ్లు పెట్టుకోవడం తో ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఆ తర్వాత ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాలపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ప్రజా పోరాటాలు చేస్తూనే వస్తోంది. తాజాగా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని చూస్తున్న ఓటీఎస్‌ పథకంపై ప్రతిపక్షాలు పెద్దఎత్తున రాద్ధాంతం చేస్తున్నాయి.

ఇది చాలా దారుణం అని విమర్శలు గుప్పిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో ప్రజల పక్షాన తాము పోరాటం చేస్తామని ... ఎవరు కూడా డ‌బ్బులు క‌ట్ట‌వ‌ద్ద‌ని చెబుతోంది. తెలుగుదేశం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవడంతో అధికార వైసిపి కాస్త డిఫెన్స్ లో పడింది. అయితే ఈ రోజు ముఖ్యమంత్రి జగన్ స్వయంగా ఈ పథకం పై సమీక్ష చేశారు. అనంతరం ఆయన ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ ఇవ్వడం గమనార్హం.

ఓ టి ఎస్ పై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ... అది పూర్తిగా స్వచ్ఛందం అని చెప్పారు. క్లియర్‌గా దీనితో రిజిస్ట్రేషన్ జరుగుతుందని ... రుణాలు మాఫీ చేయడంతోపాటు రిజిస్ట్రేషన్ చేస్తున్నామని జగన్ స్పష్టం చేశారు. ఈ పథకంపై ప్రజల్లో అవగాహన తీసుకురావాలని కూడా జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఓ టి ఎస్ పథకం అమలు కాకుండా చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. గతంలో అసలు వడ్డీ కడితే బి ఫారం పట్టా మాత్రమే ఇచ్చేవారు అని... ఇప్పుడు ఓ టి ఎస్ పథకంతో సంపూర్ణ హక్కులు కూడా ఇస్తున్నామని గుర్తు చేశారు. పేదలకు మంచి అవకాశం కల్పిస్తున్నామని ... ఆ అవకాశాలను వాడు కోవాలా వద్దా ? అన్నది వారి ఇష్టానికి వదిలేస్తున్నామని జగన్ చెప్పారు. భవిష్యత్తులో గ్రామ సచివాలయంలో కూడా రిజిస్ట్రేషన్ పనులు జరుగుతాయని స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: