తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు రాజకీయంగా తీవ్రమైన సంకట స్థితిని ఎదుర్కొంటున్నారు. గత ఎన్నికల్లో పార్టీ చరిత్రలోనే లేన‌ట్టుగా కేవలం 23 సీట్లతో సరిపెట్టుకుంది. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి చేజారి పోతే ... ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో సైతం టిడిపి పూర్తిగా ప‌డిపోతోంది. గత ఎన్నికల్లో చంద్రబాబు అక్కడ చావుతప్పి కన్నులొట్ట పోయినట్లు చందంగా కేవలం 30 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. చంద్రబాబుకు ఎప్పుడు 45 నుంచి 50 వేల ఓట్ల మెజారిటీ వస్తుంది.

అయితే గత ఎన్నికల్లో చంద్రబాబు మెజారిటీ 30 వేలకు పడిపోయింది. ఆ తర్వాత జరిగిన పంచాయతీ ఎన్నికలు - పరిషత్ ఎన్నికలతో పాటు ఇటీవల జరిగిన కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో టిడిపి ఘోరంగా ఓడిపోయింది. తొలిసారిగా ఏర్పడిన కుప్పం మున్సిపాలిటీ పై తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసేందుకు చంద్రబాబుతో పాటు లోకేష్పార్టీ రాష్ట్ర స్థాయి నేతలు అందరూ అక్కడ మకాం వేసి మరీ ప్రచారం చేశారు.

అయినా కూడా తెలుగుదేశం అక్కడ ఉన్న 25 వార్డు ల‌లో కేవలం ఆరు వార్డులతో సరిపెట్టుకుంది. దీంతో అక్క‌డ తెలుగుదేశం పార్టీ పునాదులు కదిలిపోతున్నాయ‌ని స్పష్టం గా తెలుస్తోంది. ఇక వచ్చే ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారు ? అన్న దానిపై క్లారిటీ వచ్చిందని అంటున్నారు. ప్రస్తుతం అక్కడ ఇన్చార్జిగా ఉన్న భారత్‌కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు.

ఇక వచ్చే ఎన్నికల్లో అక్కడ వైసీపీ నుంచి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం నుంచి ఒక వ్యక్తి పోటీ చేస్తారన్న టాక్ వచ్చేసింది. పెద్దిరెడ్డి కుప్పం పై కొద్దిరోజులుగా ప్రధానంగా ఫోకస్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో తన త‌మ్ముడు కుమారుడు అయిన సుధీర్ రెడ్డి ని అక్కడి నుంచి పోటీ చేయిస్తారని తెలుస్తోంది. సుధీర్ రెడ్డి ప్రస్తుతం పుంగనూరు నియోజకవర్గంలోని సోమల, స‌దుం మండలాల‌ ఇన్చార్జిగా ఉన్నారు. మరి ఇక్కడ సుధీర్ రెడ్డి పోటీ చేస్తే కచ్చితంగా చంద్రబాబు కు గట్టి పోటీ తప్పదని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: