ఏపీలో అధికారం వైసీపీలో కొందరు కీలక నేతలు చక్రం తిప్పుతున్నారు. వీరిలో విజయసాయిరెడ్డి తో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి కొందరు నేతలు ఉన్నారు. వీరితోపాటు సీనియర్ మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సైతం తన శాఖతో పాటు చిత్తూరు జిల్లా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జిల్లాలో వైసీపీని గెలిపించ‌డంలో పెద్దిరెడ్డి కీలకపాత్ర పోషించడంతో పాటు జగన్ దగ్గర మంచి మార్కులు కొట్టేశారు.

ప్రతిపక్ష నేత చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ఆయనకి షాక్ ఇచ్చేలా చేయడంలో పెద్దిరెడ్డి చాలా కష్టపడ్డారు అంటూ జగన్ కితాబు ఇచ్చారు. చిత్తూరు జిల్లా వరకు పెద్దిరెడ్డి ఏం చెబితే జగన్‌కు అదే వేదంగా ఉంటూ వస్తోంది. గత సాధారణ ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో పెద్దిరెడ్డి చెప్పినవారికి జగన్  టిక్కెట్లు ఇచ్చారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో చిత్తూరు జిల్లా పెద్దిరెడ్డి కీలక పాత్ర పోషించారని తెలుస్తోంది. సొంత పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల‌కు ఈసారి పెద్దిరెడ్డి షాక్ ఇస్తారని జిల్లా రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం నుంచి ఆయన పుంగనూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన తనయుడు మిధున్ రెడ్డి రాజంపేట ఎంపీ గా ఉన్నారు. అలాగే ఆయన మరో సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి తంబళ్లపల్లి ఎమ్మెల్యే గా ఉన్నారు. ఇప్పుడు పెద్దిరెడ్డి సోదరుని కుమారుడు సుధీర్ రెడ్డి కూడా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. సుధీర్ రెడ్డి ని వీలుంటే కుప్పం నుంచి పోటీ చేయిస్తారని అంటున్నారు.

ప్రస్తుత ఇన్చార్జిగా ఉన్న భరత్ బీసీ కోటాలో పోటీ చేస్తే ... సుధీర్ రెడ్డిని పీలేరు లేదా పలమనేరు నుంచి పోటీ చేస్తారని అంటున్నారు. అదే జరిగితే పీలేరు లో చింతల రామచంద్రారెడ్డి కి లేదా పలమనేరులో వెంకటయ్య గౌడ్ కు షాక్ తప్పదని అంటున్నారు. అలాగే నగరిలో రోజా కు కూడా టిక్కెట్ రాకుండా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఈసారి బీసీ కోటాలో రోజాకు షాక్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా పెద్దిరెడ్డి వచ్చే ఎన్నికల్లో చిత్తూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేల్లో కొంద‌రికి షాక్ ఇస్తారని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: