మహిళలు అన్ని రంగాలలో రాణిస్తూ, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వారిగా కూడా గుర్తింపు సంతరించుకుంటున్నారు. తాజాగా ఫోర్బ్స్ విడుదల చేసిన ప్రపంచ అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళల జాబితాలో భారత్ నుండి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ మొదటి స్థానంలో ఉన్నారు. ప్రపంచస్థాయిలో ఆమె 37వ స్థానంలో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా జారీచేసిన ఈ జాబితాలో మొదటి స్థానంలో అమెరికా నుండి మొకెంజి స్కాట్ ఉన్నారు. తరువాత స్థానంలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ రెండో స్థానంలో దక్కించుకున్నారు. మూడో స్థానంలో ఫ్రాన్స్ కు చెందిన క్రిస్టీన్ లగార్డ్ ఉన్నారు. నాల్గవ స్థానంలో అమెరికాకు చెందిన మోరీ బర్రా, ఐదవ స్థానంలో మెలిండా ఫ్రెంచ్ గేట్స్, ఆరవ స్థానంలో ఆబిగైల్ జాన్సన్, ఏడవ స్థానంలో స్పెయిన్ కు చెందిన అనా ప్యాట్రిసియా బోటిన్, ఎనిమిదవ స్థానంలో జర్మనీకి చెందిన ఉర్సులా వాన్ డేర్ లేయేన్, తొమ్మిదవ స్థానంలో తైవాన్ నుండి సాయ్ ఇంగ్ వైన్, పదవ స్థానంలో అమెరికా నుండి జూలీ స్వీట్ ఉన్నారు.

భారతదేశం నుండి నైకా వ్యవస్థాపకురాలు సీఈఓ ఫల్గుణి నాయర్ 88వ స్థానంలో ఉన్నారు. ఈమె భారతదేశంలో ఏడవ మహిళా బిలినియర్ గా ఉన్నారు. ఒక్కసారి నైకా స్టాక్ మార్కెట్ లో అడుగుపెట్టడంతో ఆమె అత్యంత సంపన్న మహిళగా మారిపోయారు. ఈ తాజా ఫోర్బ్స్ జాబితాలో ఇతర వ్యాపారవేత్తలలో రోహిణి నాడార్ 52వ స్థానంలో ఉండగా, హెచ్సిఎల్ సంస్థ చైర్ పర్సన్, దేశంలో మొదటి లిస్టెడ్ ఐటీ సంస్థల నాయకత్వం వహించిన మొదటి మహిళ బయో కాన్ ఎగ్జిక్యూటివ్ చైర్ పర్సన్, వ్యవస్థాపకురాలు కిరణ్ మంజునాధ్ షా 72వ స్థానంలో ఉన్నారు. ఇక ఈ ఏడాది అగ్రస్థానంలో నిలిచిన మొకెంజి స్కాట్ తన మొత్తం సంపదలో 8.6 బిలియన్ డాలర్లు అనేక సంస్థలకు విరాళంగా ప్రకటించారు.

ఒక చోట మహిళలకు స్వేచ్ఛ లేదని వాపోతుంటే, మరో పక్క ఇలా వారు అన్ని రంగాలలో తమని తాము నిరూపించుకుంటూ అందరికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. ఇలాంటి వారిని చూసి మరికొందరు ఉత్సాహాన్ని పొందటం ద్వారా వాళ్ళు పూర్తిగా స్వేచ్ఛను ఆస్వాదించగలరు. పెద్దలు అన్నట్టుగా ఇంట్లో ఇల్లాలు చదువుకుంటే, ఇల్లంతా చదువుకున్నట్టుగా; దేశంలో లేదు ప్రపంచంలో మహిళలు ముందడుగు వేస్తుంటే, ఆయా దేశాలు లేదా ప్రపంచం కూడా అభివృద్ధిపధంలో ఉంటుంది అనడంలో అతిశయోక్తి ఏమీ లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: