ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఓటీఎస్ రగడ తారాస్థాయిలో ఉంది. వన్ టైమ్ సెటిల్‌మెంట్ పేరుతో ఆస్తిపై ప్రతి ఒక్కరికి హక్కు కలుగుతుందని ఏపీ ప్రభుత్వం ప్రజలకు హామీ ఇస్తోంది. ఇదే సమయంలో దీని వ్లల సామాన్య ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అధికార పార్టీపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరో అడుగు ముందుకు కూడా వేశారు. ఎవరూ కట్టాల్సిన అవసరం లేదని... తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత... అందరికీ మాఫీ చేస్తామంటూ ప్రకటించారు కూడా. దీంతో అసలు వన్ టైమ్ సెటిల్‌మెంట్ కట్టాలా వద్దా... కట్టకపోతే వచ్చే నష్టం ఏమిటీ... కడితే జరిగా లాభం ఏమిటీ... సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా... కట్టకపోతే... పథకాలు అన్నీ నిజంగానే ఆగిపోతాయా అనే అనుమానాలు ప్రస్తుతం లబ్దిదారుల్లో ఉన్నాయి. రాజకీయ పార్టీల నేతలు చెబుతున్న మాటలతో ప్రజలు మాత్రం గందరగోళానికి గురవుతున్నారు.

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంలో భాగంగా 1983 నుంచి 2011 ఆగస్టు 15వ తేదీ వరకు రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ నుంచి రుణం పొందిన వారికి, ప్రభుత్వ స్థలంలో ఇళ్లు నిర్మించుకున్న లబ్దిదారులకు యాజమాన్య హక్కులు కల్పించాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. ఓటీఎస్ పథకంలో భాగంగా లబ్దిదారుల రుణాలను వన్ టైమ్ సెటిల్ మెంట్ పేరుతో చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది. అలా చెల్లించిన లబ్దిదారులకు వారి ఇంటిపై పూర్తిస్థాయి హక్కులు కల్పిస్తూ... పత్రాలను రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని కూడా జగన్ సర్కార్ హామీ ఇస్తోంది. అయితే అసలే రాష్ట్ర ప్రజల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. కరోనా కారణంగా దాదాపు రెండేళ్లుగా ఆదాయం సగానికి సగం పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ సర్కార్ నిర్ణయించిన మొత్తం కట్టేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 30 ఏళ్ల క్రితం తీసుకున్న లోన్లు ఇప్పుడు చెల్లించాలని ప్రభుత్వం ఎలా అడుగుతుందని కూడా ప్రశ్నిస్తున్నారు. ఓటీఎస్ కోసం ఎవరినీ బలవంతం చేయడం లేదని కూడా మంత్రులు సర్ది చెబుతున్నారు. అయితే ఓటీఎస్ వల్ల ప్రజలకు లాభం జరుగుతుందని కూడా చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: