తెలుగు రాష్ట్రాలు విడివడిన సమయంలో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ దశాబ్దం పాటు కొనసాగుతుందని చట్టంలో పొందుపరిచారు. అయితే అప్పటి పరిస్థితులలో ఏపీ ప్రభుత్వం ఆ రాజధానిని హఠాత్తుగా వదిలేసి, రాష్ట్రానికి వచ్చేసింది. అప్పటి నుండి మంగళగిరి కేంద్రంగా అమరావతి రాజధాని అని, దానిపై కసరత్తు ప్రారంభించడం చేసింది అప్పటి ప్రభుత్వం. అంటే అప్పటితో ఏపీకి ఉమ్మడి రాజధాని అనే అవసరం లేదనే భవనంలోకి వచ్చేసింది తెలంగాణా ప్రభుత్వం, అలాగే కేంద్ర ప్రభుత్వం. వారి అభిప్రాయాలు ఎలాగా ఉన్నప్పటికీ, ఏపీలో మాత్రం ఇంకా స్థిరమైన రాజధాని ఒక్కచోట కూడా ఏర్పాటు చేయబడలేదు. దీనితో ఇన్నేళ్ళుగా రాజధాని కూడా లేకపోవడంతో అభివృద్ధి కూడా నత్తనడకనే సాగుతుంది.

ఒకరకంగా చెప్పాలంటే నాయకుడు లేని సైన్యంగా ఏపీ రాష్ట్రం ఉండిపోయింది. కొత్తగా వచ్చిన వైసీపీ ప్రభుత్వం అందరికి అభివృద్ధి ఫలాలు అందించాలని, హైదరాబాద్ అనే చోట పెట్టుబడులు అన్ని పెట్టడం వలన రాష్ట్రవిభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయిందని, ఆ లోటు మరోసారి రాకూడదనే ఉద్దేశ్యంతో, తూర్పున విశాఖ, రాయలసీమలో కర్నూలు, మధ్యలో అమరావతి లను మూడు రాజధానులుగా చేస్తే అన్ని ప్రాంతాలు అభివృద్ధికి నోచుకుంటాయని ఆలోచించారు. అలాగే ఆయా ప్రాంతాలలో కూడా విభజన ద్వారా వచ్చిన నిరాశనిస్పృహలు ఒక్కసారిగా వెళ్లగొట్టడానికి ఇదొక్కటే మార్గం అని ప్రభుత్వం ఆశించింది. కానీ, దానిపై లేనిపోని రగడ కావడం, అదంతా కోర్టులలో మగ్గిపోతుండటం తో ఇంకా ఏపీకి రాజధాని పలానా అని చెప్పుకోవడానికి ఏదీ లేకుండానే పోతుంది.

విభజన చట్టం ప్రకారం ఇంకా హైదరాబాద్ మరో రెండు ఏళ్ళు ఉమ్మడి రాజధాని కావచ్చుగాక, ఇన్నాళ్లు ఒరగనిది, ఈ రెండేళ్లలో ఏమి ఒరిగిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఉమ్మడి అని మొదటుపెడితే, పాలనా వ్యవస్థలు ఇక్కడకు రావాల్సి ఉంటుంది. అప్పట్లో ఆ తరలింపు ఎంత గందరగోళంగా జరిగిందో అందరికి తెలిసిందే, ఇప్పుడు మళ్ళీ అదే చేస్తే, ఉద్యోగులు విసిగిపోవడం కాదు, ప్రజలు కూడా విసిగిపోయే అవకాశాలు బాగానే ఉంటాయి. అలాగే అసలు మళ్ళీ రాష్ట్రంలో అడుగుపెట్టడానికి కేసీఆర్ లాంటి వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి ఉంటుందా అనేది కూడా ఇక్కడ ప్రశ్న. మరోసారి ఉమ్మడి అని అంటే, ఇప్పటికే స్తబ్దుగా నడుస్తున్న ఏపీ రాజధాని విషయం మరో రెండేళ్లు మరుగున పడే అవకాశాలే ఎక్కవుగా ఉంటాయి. అలాగని ఈ రెండేళ్లలో అక్కడ బృహత్తర రాజధాని ఏమీ ఏర్పాటు చేయడం సాధ్యపడకపోవచ్చు, ఎంతో కొంత వరకు అడుగులు మాత్రం పడే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: