హెలికాప్టర్ ప్రమాదాలు ఇటీవల తరచుగా చూస్తున్నాం. ఇలాంటి ప్రయాణాలు చేసేనుడుకు సాధారణంగానే భయం వేస్తుంది, అలాంటిది ఈ ప్రమాదాలు వింటుంటే అసలు విమాన ప్రయాణాలు అంటేనే వెనకాడాల్సిన పరిస్థితి వచ్చేట్టుగానే ఉంది. ఈ ప్రమాదాలు సామాన్యులకు జరిగాయి అంటే అదేదో నిర్లక్ష్యం అనుకోవచ్చు. కానీ ప్రముఖులు కూడా ఈ ప్రమాదాలకు గురికావడం మాత్రం ఆలోచించ వలసిన విషయం. అన్నిటిలో అనుమానాలు తప్పు కావచ్చు కానీ, ప్రముఖులు వెళ్లే వాహనాలకు కూడా తనిఖీలు కరువయ్యాయంటే ఇక సామాన్యుల మాట చెప్పనవసరం లేదు. ఇదంతా నిర్లక్ష్యమేనా లేక సాంకేతిక లోపం హఠాత్తుగా రావడం కారణమా లేక పైలెట్ అనారోగ్య కారణమా లేక ఇందులో కూడా కుట్రలు కుతంత్రాలు ఉన్నాయా అనే సందేహాలు తప్పకుండ వస్తాయి.

ఒకరో ఇద్దరో కాదు, నటి సౌందర్య, బాలయోగి, సంజయ్ గాంధీ, తెలుగు రాష్ట్ర మాజీ సీఎం వైఎస్, నేడు బిపిన్ రావత్ లాంటి ప్రముఖులు కూడా ఈ ప్రమాదాలలోనే మృతి చెందారు. ఇదంతా సాంకేతిక లోపం వలన అనుకుందాం అంటే, ఇలాంటి వారు కాదు, అసలు సామాన్యులు ప్రయాణించే విమానాలు కూడా ప్రయాణానికి సిద్ధం చేసే ముందు క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. సాంకేతిక లోపల నుండి ఇంధనం వరకు అన్ని కోణాలలో తనిఖీలు జరిగిన తరువాత మాత్రమే ఆ విమానానికి అనుమతి లభిస్తుంది. అప్పుడు అందులో బుకింగ్ చేసుకుని ప్రయాణాలు జరుగుతాయి. మరి విప్ లు ప్రయాణిస్తున్నారు అంటే ఇంకెంత జాగర్తలు, తనిఖీలు చేసి ఉండొచ్చు. అయినా ప్రమాదాలు జరుగుతున్నాయి అంటే వాతావరణం అనుకూలంగా లేకపోవడం కూడా ఇక్కడ ఒక కారణం చెప్పవచ్చు.  

అన్ని ప్రమాదాలు వాతావరణ అననుకూలత హఠాత్తుగా సంభవించడం వలన జరిగాయి అనుకోవడానికి లేదు. సాధారణంగా నేలపై తుక్కు బస్సులు నడిపిస్తున్నట్టుగా విమానాలు నడిపిస్తున్నారా, మరేదైనా బలమైన కారణం ఉన్నదా, ఇలాంటివి ప్రమాదాలు చోటుచేసుకున్నప్పుడు వచ్చే సహజ సందేహాలు. వీటిని ఆపడం సాధ్యం కాకపోవచ్చు కానీ, ప్రమాదాలకు మాత్రం కారణాలు ఇప్పటికి కొన్ని ఘటనలలో తేల్చలేదు. మహా అయితే సాంకేతిక లోపం అంటారు. నిజమే కావచ్చు, కోట్లు పోసి కొన్నప్పటికీ దానికి ఒక ఎక్స్పైరీ తేదీ ఉంటుంది కదూ, అది దాటాక కూడా వాడితే ఇంతేనేమో! మాములుగా మార్కెట్ లో వాహనం కొన్నప్పుడు బాగానే ఉన్నప్పటికీ దానికి సరైన మైంటెనెన్సు లేకపోతే అది తొందరగా పాడైపోయే అవకాశాలు ఉండొచ్చు. ఎక్కువ రోజులు వాడకుండా పక్కన పెట్టేసిన దానిని హఠాత్తుగా వాడటం కూడా ప్రమాదానికి దారితీయవచ్చు. ఇవన్నీ అక్కడ ఉన్న వారికి తెలియదా అంటే తెలుసు కానీ పోవాల్సిన సమయం వచ్చినప్పుడు ఆయా చిన్న చిన్న విషయాలు కూడా స్ఫురించబోవు, బహుశా అదే జరిగి ఉండొచ్చు, నిజం పెరుమాళ్ళకు ఎరుక!

మరింత సమాచారం తెలుసుకోండి: