అస్తవ్యస్త పాలన
అస్తవ్యస్త నిర్ణయాలు
వేటిలోనూ పరిణితి లేదు
అయినా కూడా  అధికారం మాదే మళ్లీ మళ్లీ
అని ప్రకటించే తీరు ఒకటి విస్మయం!
అదే రేపటి వేళ కూడా వారి నమ్మకం........


ఆదాయం ఎంతుందో తెలియకుండా అప్పు లెక్క తేలకుండా ఓ ప్రభుత్వం ఎలా నడుచుకుంటుందని? అయినా కూడా అప్పుల చిట్టా మాత్రం పెరిగి పెద్దదువుతూనే ఉంది. అంతటి రాక్షస లెక్కలు ఎవ్వరికీ అంతుపోలడం లేదు. కేంద్రం ఆదుకున్నా, ఎంతో కొంత దయదలచి నిధులు ఇచ్చినా కూడా ఇప్పటికిప్పుడు గండం గట్టెక్కడం సాధ్యం కాదు గాక కాదు. ఈ తరుణా జగన్ సర్కారు తమ ముందున్న సవాళ్లను ఎలా అధిగమిస్తుందని? అందుకే కొట్టు కట్టేసి ముందస్తు ఎన్నికలకు వెళ్తారన్నది ఓ ఊహ!


అపరిపక్వ నిర్ణయాలు కారణంగా ఖజనా మొత్తం ఎప్పుడో ఖాళీ అయిపోయింది. కొన్ని నిబంధనలు సవరించి లేదా సడలించి అప్పుల కోసం తిప్పలు పడ్డా కూడా ఫలితం లేకపోయింది. అంతేకాదు పాత అప్పులను తీర్చడం కోసమే కొత్త అప్పులు తీసుకువస్తున్నారన్న అపవాదు కూడా ఎప్పటి నుంచో మోస్తోంది వైసీపీ. ఈ తరుణాన మహా సముద్రం లాంటి ఈ ప్రభుత్వాన్ని నడిపేందుకు పిల్ల కాలువ శక్తి ఏపాటి. అయినా ఇప్పటికీ కూడా దిద్దుబాటు చర్యలేవీ లేవు. రేపో మాపో ప్రభుత్వాన్ని వైండప్ చేసి  ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచన తప్ప!



అఖండ సినిమాలో వైసీపీ ప్రభుత్వ పెద్ద ను ఉద్దేశించి చెప్పిన విధంగా ఓ డైలాగ్ ఉంది. అంచనా వేయడానికి నువ్వేమయినా పోలవరం డ్యామా, పట్టి సీమ తూమా  పిల్ల కాలువ ..అని చెప్పిన మాట ఇప్పుడు ప్రభంజనం అయి మోగిపోతోంది. రాష్ట్ర రాజకీయాల్లో ఈ డైలాగ్ ప్రభంజనం సృష్టిస్తోంది. అధికారం చేపట్టాక రెండున్నరేళ్లు పూర్తయినా ఇప్పటిదాకా చేపట్టిన అభివృద్ధి పని ఒక్కటంటే ఒక్కటి లేదు. ఉన్న డబ్బులన్నీ సంక్షేమాలకే ఖర్చు చేసి జనం క్షేమమే మా క్షేమం అన్న విధంగా జగన్ ఇస్తున్న స్టేట్మెంట్లు కల్లోలిత వాతావరణానికి కారణం అవుతున్నాయి. రెండు తీవ్ర తుఫానులు ఆంధ్రావనిని అతలాకుతలం చేశాయి. అయినా కూడా సంబంధిత నష్ట నివారణ కానీ లేదా తుఫాను సాయం కానీ ఇప్పటికీ అందించిన దాఖలాలు లేవు. పంట నష్ట పరిహారం ఇచ్చామని గులాబ్ తుఫాను బాధిత రైతులను ఆదుకున్నామని వైసీపీ సర్కారు చెప్పినా కూడా అవేవీ రైతు గోడును తీర్చేవే కావు. ఇక జవాద్ తుఫాను కారణంగా 3300 కోట్ల రూపాయల మేర పంట నష్టం వాటిల్లింది. అయినా కూడా ఇప్పటిదాకా బాధిత రైతులను పరామర్శించిందీ లేదు. ఆదుకున్నదీ లేదు. ఇప్పటికిప్పుడు పంట నష్ట పరిహారం ఇవ్వడం ఎలానూ సాధ్యం కాదు కానీ  కనీసం బాధిత ప్రాంతాలలో ఎమ్మెల్యేలు తిరిగి నష్ట నివారణ అంచనాపై అధికారులతో మాట్లాడితే కాస్తో కూస్తో ప్రజలకు ఉపశమనం.



మరింత సమాచారం తెలుసుకోండి: