ధ‌నిక దేశాలు పేద దేశాలు

అని ప్ర‌పంచం రెండుగా విడిపోయి

ఎవ‌రి దారి వారు ఎవ‌రి సుఖం వారు

చూసుకుంటున్న త‌రుణాన

టీకాల విష‌య‌మై కూడా ఇలాంటి

భావ దారిద్య‌మే నెల‌కొన‌డంలో ఆశ్చ‌ర్యం ఏముంద‌ని?



క‌రోనా కార‌ణంగా చాలా కుటుంబాలు రోడ్డున ప‌డ్డాయి. క‌రోనా కార‌ణంగా చాలా దేశాలు రోడ్డున ప‌డ్డాయి. దేశాలూ, కుటుంబాలు ఎలా ఉన్నా కూడా వైద్యులు కొంద‌రు వైద్యాల‌యాలు కొంత లాభ‌ప‌డ్డాయి. డ‌యాగ్నోసెస్ సెంట‌ర్లు ఇంకా బాగా లాభ‌ప‌డ్డాయి. కరోనా త‌రువాత ప‌రిణామాలు కూడా  చాలా దేశాల‌కు క‌లిసి వ‌చ్చాయి. ప్ర‌భుత్వాలు రెండు ద‌శ‌ల్లో లాక్డౌన్ ను అమలు చేశాక చాలా కుటుంబాలులో ఆక‌లి చావులు  నెల‌కొన్నాయి. అయినా కూడా ప్ర‌భుత్వాలు ప‌రిహారం అందించ‌డంలో ఎప్ప‌టిలానే చాలా రుజువులు సాక్షాలూ కావాల‌ని ప‌ట్టుబ‌ట్ట‌డం హాస్యాస్ప‌దం. అయినా కూడా చాలా మంది ఇప్ప‌టికీ ప‌రిహారం అందుతుంద‌న్న ఆశ‌తోనే కాలం గడుపుతున్నారు. ఈ నేప‌థ్యంలో పరిహారం మాటెలా ఉన్నా  కూడా కరోనా అన్న‌ది ప్ర‌భుత్వ విధానాల్లో ఎటువంటి మార్పులూ తీసుకుని రాలేక‌పోయింది అన్న‌ది నిజం. అదేవిధంగా మెడిక‌ల్ మాఫియా రెచ్చిపోయి రంకెలేసినా కూడా దానిని కూడా నియంత్రించ‌లేని చేత‌గాని ప్ర‌భుత్వాలు ఇప్ప‌టికీ మ‌న మ‌ధ్యే మ‌న‌తోనే మ‌న ముందే ఉన్నాయి. ఉంటాయి కూడా!


ఇక టీకాల‌కు సంబంధించి కో వ్యాగ్జీన్ కానీ కొవిషీల్డ్ కానీ రెండు డోసులు వేసుకున్న వారు కూడా మ‌రో డోసు వేసుకోవాల‌ని కొంద‌రు నిపుణులు చెబుతున్నారు. దీర్ఘ కాలిక వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్న‌వారు, ఇమ్యునిటీ త‌క్కువ ఉన్న వారు కూడా వెంట‌నే బూస్ట‌ర్ డోస్ వేసుకోవాల‌ని అంటున్నారు. పైన చెప్పిన రెండు వ్యాక్సిన్లు కాకుండా ర‌ష్యా విడుద‌ల చేసిన స్పూత్నిక్ కూడా అందుబాటులోకి వ‌చ్చింది. దీంతో వ్యాక్సిన్ చుట్టూ విష రాజకీయం న‌డుస్తోంది. కొన్ని సంస్థ‌లు కొన్ని దేశాలు ఈ రాజ‌కీయం న‌డుపుతున్నాయి. కొవి షీల్డ్ కానీ కొవ్యాగ్జీన్ కానీ రెండూ ప‌నితీరు లో ఒకేలానే ఉన్నాయి. అయితే  కొన్నిదేశాలు ఫ‌లానా టీకా తీసుకుంటేనే త‌మ వ‌ద్ద‌కు రానిస్తామ‌న్న డ్రామా న‌డుపుతున్నారు. తాజాగా ఒమిక్రాన్ వేరియంట్ రాక నేప‌థ్యంలో ఇంకొన్ని రాజ‌కీయ నాట‌కాలు పెరిగిపోయాయి. ఈ ద‌శ‌లో  80 శాతం టీకాలను ధనిక దేశాలు త‌మ వ‌ద్ద‌నే ఉంచుకుని, టీకా కొర‌త రేప‌టి వేళ త‌లెత్త కుండా జాగ్ర‌త్త‌ప‌డుతున్నాయ‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. దీంతో మ‌ర‌ణాల రేటు మ‌రింత పెరిగిపోనుంది. ఇప్ప‌టిదాకా కోవిడ్ మ‌ర‌ణాలు 50 ల‌క్ష‌లు కాగా తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో మ‌రో ఐదు ల‌క్ష‌ల మంది చ‌నిపోయే అవ‌కాశం ఉందని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఈ ద‌శ‌లో విశ్వ మానవ సౌభ్రాత‌త్వం అన్న‌ది ఆలోచ‌న చేయ‌డం  ఆచ‌ర‌ణ‌కు తూగేలా ఆ మాట‌ను చేయ‌డం అస్స‌లు త‌గ‌ని పని!



మరింత సమాచారం తెలుసుకోండి: