తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలలో జరిగేటటువంటి ఎన్నికలు మరికొద్ది గంటల్లోనే స్టార్ట్ కానున్నాయి. ఈ ఎన్నికల కోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి పెట్టారు. మొత్తం వీటిలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేయగా ఒక ఆరు స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. మిగిలిన ఆరు స్థానాలు ఏకగ్రీవం అయిపోయాయి. రేపు ఉదయం ఎన్ని గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈనెల 14వ తేదీన ఫలితాలు కూడా వస్తాయి.

 ఈ ఎన్నికల్లో అయిదు ఉమ్మడి జిల్లాల పరిధిలో జరగనున్నాయి. ఇందులో ఉమ్మడి అదిలాబాద్, నల్గొండ, మెదక్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలో జరగనుంది. మొత్తం 37 పోలింగ్ కేంద్రాల్లో జరిగే ఈ ఎన్నికల్లో 5326 ఓటింగ్లో పాల్గొన్నారు. ఇందులో  కరీంనగర్ జిల్లాలో రెండు స్థానాలకు  10 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. నల్గొండలో ఒక స్థానానికి ఏడుగురు పోటీ,  ఆదిలాబాద్ జిల్లాలో ఒక స్థానం ఖాళీగా ఉండగా అక్కడ ఇద్దరు పోటీలో ఉన్నారు.  ఖమ్మంలో రెండు స్థానాలకు నలుగురు,అలాగే మెదక్ లో ఒక స్థానానికి ముగ్గురు పోటీలో నిలిచారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని ఎన్నికల ప్రధాన అధికారి ప్రశాంత్ గొయల్ ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇప్పటికే ఈ జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. అయితే ఈ పోలింగ్ రేపు ఉదయం ఎన్ని గంటలకు మొదలై సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంటుంది.

ఇప్పటికే ఎన్నికల విధుల్లో పాల్గొనే ఎటువంటి వ్యక్తులకు శిక్షణ కూడా పూర్తయినట్లు  తెలుస్తోంది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో తీసుకుంటే 937 మంది ఓటర్లు 8 పోలింగ్  స్టేషన్లు ఉన్నాయి. కరీంనగర్లో 1324 ఓట్లు ఎనిమిది పోలింగ్ స్టేషన్లు, నల్లగొండలో 1272 ఓటర్లు ఉండగా ఎనిమిది పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. మొత్తం అన్ని జిల్లాల్లో కలిపి 37 పోలింగ్ స్టేషన్ లు ఏర్పాటు చేశారని ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ యొక్క పోలింగ్ కేంద్రాలకు గోవా, బెంగళూరు వెళ్లినటువంటి వారంతా డైరెక్టుగా పోలింగ్ కేంద్రానికి రానున్నారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: