పార్లమెంట్ సమావేశాల దృష్ట్యా ఏపీ మంత్రులు వివిధ సమస్యలపై ప్రస్తావించారు. ఎంపీ సత్యవతి రైల్వే జోన్ పై ప్రస్తావించగా, దక్షణ కోస్తా జోన్ ఇప్పటికే ప్రకటన చేయబడింది, దాని కోసం 300 కోట్ల నిధులు ఇచ్చే అవకాశం ఉంది. అయినా ఏవో సాకులు చెప్తూ, జోన్ పై అనవసర అయోమయాన్ని సృష్టిస్తూనే ఉన్నారు. ముందుగా ప్రకటించిన దక్షిణ కోస్తా జోన్ పై డీపీఆర్ కూడా సిద్దమైనప్పటికీ ఈ రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారో అర్ధం కావడం లేదు. వాల్తేరు డివిజన్ ను దక్షిణకోస్తా లో కలపడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. రాష్ట్రప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు గా ముందుకు పోతుంది. అందుకు కేంద్రం నుండి కూడా పూర్తి సహకారం ఉండటం అవసరం. అలాగే రైతులకు కనీస మద్దతు ధర పై చట్టం ఉండటం అత్యవసరం అని మంత్రి ప్రస్తావనకు తెచ్చారు.

మరో మంత్రి ఎంవీ సత్యనారాయణ విశాఖ ఉక్కుపై ప్రస్తావించారు. కేంద్రం దానిని ప్రైవేట్ పరం చేయకుండా సొంత ఘనులు ఏర్పాటు చేయడం గురించి ఆలోచించాలి. ప్రైవేట్ వాళ్ళు ప్లాంట్ నడపడం పైన కంటే ఉన్న స్థలాలను రియల్ ఎస్టేట్ కింద మార్చేస్తారని గ్రహించాలి. ఆ ఉక్కు పరిశ్రమ కోసం చాలా మంది ప్రాణత్యాగాలు చేశారు. దానిని మళ్ళీ కేంద్రం తీసుకెళ్లిపోవడం వలన ఆనాటి త్యాగాలకు అర్ధం లేకుండాపోతుంది. ఇప్పటీకే కార్మికులు దానిపై చాలా రోజులుగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. దీనిపై ప్రభుత్వం కూడా ఎన్నో లేఖలు ప్రధాని గారికి కూడా రాయడం జరిగింది. అవన్నీ పరిగణలోకి తీసుకోని నిర్ణయాన్ని మార్చుకోవాలని ఆశిస్తున్నాము. విశాఖ ఉక్కు ఆంధ్రా హక్కుగా కేంద్రం గురించాలని కోరుతున్నాం.

మంత్రి గోరెంట్ల మాధవ్, రాత్రి సమయాలలో కూడా శవపరీక్ష సేవలు అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. అలాగే ఆయా పరీక్ష నివేదికలు కూడా రాతపూర్వకంగా కాకుండా టైపు చేసినవి అయితే స్పష్టంగా ఉంటాయని, లేదంటే ఆయా చేతి రాత అర్ధం కావడం లేదని తెలిపారు. అలాగే తనకు రఘురామకృష్ణం రాజుగారు ఎదురైనంత మాత్రాన తిట్టినట్టే కథలు అల్లేస్తుంటే  ఎలా అని ఆయన ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: