ఏపీలో ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి...వైసీపీకి ఇప్పటివరకు అండగా ఉన్న నేతలు రివర్స్ అయ్యే పరిస్తితి వస్తుంది...అధికారంలోకి వచ్చాక కూడా తమకు న్యాయం జరగడం లేదని కొందరు నేతలు ఇప్పటివరకు అంతర్గతంగానే అసంతృప్తిగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఒకో నేత బయటపడిపోతున్నారు. మారుతున్న రాజకీయ పరిణామాలని బట్టి నేతలు కూడా మారుతూ వస్తున్నారు.

ముఖ్యంగా వైసీపీలో ఉన్న కమ్మ వర్గంలో మార్పులు ఎక్కువగా వస్తున్నట్లు కనిపిస్తోంది. మామూలుగా కమ్మ వర్గం అంటే టీడీపీకి మద్ధతు ఉండే వర్గం అని అనుకుంటారు. కానీ గత ఎన్నికల్లో కమ్మ వర్గంలో కొందరు వైసీపీకి మద్ధతుగా నిలిచారు. అలాగే ఆ పార్టీ తరుపున కొందరు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిచారు. ఇక కొడాలి నాని లాంటి వారైతే మంత్రిగా ఉన్నారు. అయితే అంతా బాగానే ఉందనుకుంటే..వైసీపీ అధికారంలోకి వచ్చాక కమ్మ వర్గం టార్గెట్‌గానే రాజకీయం నడుస్తున్నట్లు కనిపిస్తోంది.

దీంతో నిదానంగా కమ్మ వర్గం ఏకమయ్యే పరిస్తితి వస్తుంది. ఇటీవల భువనేశ్వరిపై అసభ్యంగా మాట్లాడటం...చంద్రబాబు కన్నీరు పెట్టుకోవడం కావొచ్చు..ఈ ఎపిసోడ్స్‌తో సీన్ మారుతూ వస్తుంది. పైగా కొడాలి నాని, వంశీ లాంటి కమ్మ నేతల చేతే...చంద్రబాబుని తిట్టించడంపై కమ్మ వర్గం కాస్త సీరియస్‌ అయ్యే పరిస్తితి వచ్చింది.

అయితే ఈ ఎపిసోడ్‌లో వైసీపీలో ఉన్న ఇతర కమ్మ నేతలు కూడా అసంతృప్తిగానే ఉన్నట్లు తెలుస్తోంది. పైగా నాని, వంశీ తప్ప మిగిలిన కమ్మ నేతలు పెద్దగా చంద్రబాబుని విమర్శించిన సందర్భాలు లేవు. ఇక తాజాగా వైసీపీ సీనియర్ నేత మర్రి రాజశేఖర్‌కు ఎలాంటి పదవి రాకపోవడంపై కూడా గుంటూరులో కమ్మ వర్గం అసంతృప్తిగా ఉంది. ఇదే క్రమంలో మర్రి రాజశేఖర్ బావమరిది వెంకటసుబ్బయ్య సైతం...డైరక్ట్‌గా జగన్‌పైనే విమర్శలు చేశారు. రోశయ్యని చివరి చూపు చూసేందుకు జగన్‌కు తీరిక లేదా? అని ప్రశ్నించిన సుబ్బయ్య.. సాక్షి మీడియా..చంద్రబాబుపై అసందర్భంగా కథనాలు వేస్తుందని ఫైర్ అయ్యారు. అలాగే వైసీపీలో తమ కులానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంటే వైసీపీకి మద్ధతుగా ఉన్న కమ్మ నేతలే రివర్స్ అయ్యే పరిస్తితి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp