ఇజ్రాయిల్ తమ దేశ రక్షణ విషయంలో ఎంతో ఖచ్చితత్వంతో ముందుకు సాగుతూ ఉంటుంది. తమ దేశ రక్షణకు ఏ మాత్రం భంగం కలుగుతుంది అని భావించిన కూడా యుద్ధానికి సిద్ధం అన్న విధంగా వ్యవహరిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఇక ఇరాన్ దేశంపై ఇప్పటికే ఇజ్రాయిల్ పలుమార్లు దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. రహస్యంగా ప్రపంచానికి తెలియకుండా ఇరాన్ అణు ఆయుధాలను తయారు చేయడంపై  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఇజ్రాయిల్. ఈ క్రమంలోనే ఇరాన్ లో ఉన్నటువంటి అణు ఆయుధ కర్మాగారాలకు మిస్సైల్స్  ప్రయోగించి ధ్వంసం చేయడం లాంటివి కూడా చేసింది.


 అంతేకాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో ఇరాన్ అణు శాస్త్రవేత్తలను సైతం దారుణంగా హత్య చేయడం ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. అయితే ఇలా ఇజ్రాయిల్ చేయడం వెనుక అగ్రరాజ్యమైన అమెరికా హస్తం కూడాఅన్నది ఎన్ని రోజులనుంచి అందరూ అనుకుంటున్న మాట. ఇక ఇప్పుడు ఇజ్రాయిల్ అమెరికాతో కలిసి ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవలే అమెరికా ఇజ్రాయిల్ భేటీ కావడం ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. అమెరికా ఇజ్రాయెల్ కలిసి మరోసారి ఇరాన్ మీద దాడి చేయడానికి సిద్ధమవుతున్నారా అన్న చర్చ మొదలయింది.


 అయితే అమెరికా ఇజ్రాయెల్ కలిసి అణు కర్మాగారాల పై దాడి చేయడం అణు శాస్త్రవేత్తలను మట్టు పెట్టడం లాంటివి చేసినప్పటికీ ఇరాన్ ప్రపంచానికి తెలియకుండా రహస్యంగా అణు ఆయుధాలను తయారు చేస్తుంది అన్న ఈ విషయాన్ని ఇటీవల ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ విభాగం గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఒకవేళ తీవ్రమైన పరిస్థితులు వస్తే ఇరాన్ పై దాడి చేయాలి అనే ఈ విషయంపైన ఇటీవలే ఇజ్రాయెల్ అమెరికా భేటీ అయినట్లు ప్రస్తుతం అంతర్జాతీయ మీడియాలో ఒక చర్చ నడుస్తోంది. ఇక ఇది కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: