జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల‌కు మ‌ద్ధ‌తుగా ముందుకొస్తున్నారు. కొద్ది నెల‌ల క్రితం ఢిల్లీలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కేంద్ర హోం శాఖా మంత్రిని క‌లిసి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్ర‌యివేటీక‌ర‌ణపైన పున‌రాలోచించాల‌ని కోరారు. కేంద్రం మాత్రం ఈ విష‌యంలో వెన‌క్కు త‌గ్గేది లేద‌ని ప‌దేప‌దే చెబుతూ వ‌స్తోంది. దీంతో.. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు 300 రోజులుగా ఆందోళ‌న చేస్తున్నారు. అన్ని పార్టీలు మ‌ద్ధ‌తు వారి పోరాటానికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాయి. ఇక కొద్ది రోజుల క్రితం ప‌వ‌న్ క‌ళ్యాణ్ విశాఖ‌ లో స్టీల్ ప్లాంట్ కార్మికుల‌కు మ‌ద్ధ‌తుగా స‌భ‌లో పాల్గొన్నారు.


 ఆ స‌మ‌యంలో కేంద్ర నిర్ణ‌యాన్ని పార్ల‌మెంట్‌లో వైసీపీ ఈ విష‌యం పైన ఎందుకు నిల‌దీయ‌ద‌ని ప్ర‌శ్నించారు. వెంట‌నే అఖిల‌ప‌క్ష స‌మావేశం ఏర్పాటు చేయనుందో స్ప‌ష్ట‌త ఇవ్వాలంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అల్టిమేటం జారీ చేశారు. కానీ, దానిపైన ఏపీ ప్ర‌భుత్వం స్పందించ‌లేదు. ఇక స్టీల్ ప్లాంట్ కార్మికుల‌కు అండ‌గా ఉంటాన‌ని హామీ ఇవ్వ‌డంతో.. ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ దీక్ష చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. కేంద్ర ప్ర‌భ‌త్వం నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా మంగ‌ళ‌గిరి పార్టీ కార్యాల‌యంలో ఉద‌యం 10 గంట‌ల నుంచి సాయంత్రం 5గంట‌ల వ‌ర‌కు ప‌వ‌న్ దీక్ష చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు.


 అయితే, కొంత కాలంగా రాష్ట్రంలో బీజేపీ - జ‌న‌సేన దోస్తి ఉన్నా. అది నామ్‌కే వాస్తు అన్న‌ట్టుగా మారిపోయింది. దీంతో ఇప్పుడు ప‌వ‌న్ దీక్ష చేయ‌డం వ‌ల్ల ఆయ‌న ప‌రోక్షంగా బీజేపికి దూర‌మ‌వుతున్నార‌నే సంకేతాలు ఇస్తున్నార‌నే చ‌ర్చ మొద‌లైంది. దీంతో భ‌విష్య‌త్తులో బీజేపీ - జ‌న‌సేన పొత్తుపై నీలి నీడ‌లు క‌మ్ముకుంటున్నాఅనే అంచ‌నాలు మొద‌ల‌య్యాయి. దీంతో టీడీపీ నేత‌లు కొంద‌రు బ‌హిరంగంగానే ప‌వ‌న్‌-టీడీపీ మ‌రోసారి పొత్తు పెట్టుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. తాజా ప‌రిణామాల‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజకీయ స‌మీక‌ర‌ణాలు కొత్తగా మారుతున్నాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: