సండే అన‌ను

మండే అన‌ను

ఎన్న‌డూ నీదాన్నిరో అన్న‌ది కాలం అనే క‌న్య

కావ్యం అనే క‌న్య కూడా!

ఆ విధంగానో ఏ విధంగానో  ఐటీ శాఖ మంత్రి

ఇవాళ కాస్త ప్ర‌త్యేకం కావొచ్చు..

ఔ మ‌ల్ల సామాన్యం  ఎందుకు కాదో త‌రువాత చెబుతూ

బాలినేని స‌ర్ మీకు జ‌న్మ‌దిన్ ముబార‌క్

జీత‌ర‌హో చ‌ల్తే ర‌హో అన్న మాట కూడా యాడ్ చేసుకోండి ఏం కాదు


ఆదివారంలో ఏ ప్ర‌త్యేకం లేదు. ప్ర‌త్యేకం అనుకున్న‌వ‌న్నీ సామాన్యంలానే తోచాయి. తోచిన‌వ‌న్నీ రాసుకుంటూ పోయాను. క‌నుక ఇంకా రాసేందుకు, చెప్పేందుకు మిగిలిన‌వేవో వెతుక్కోవ‌డం కూడా జీవితాద‌ర్శంకు కాస్త ప‌నికి వ‌చ్చే విష‌య‌మూ మ‌రియు సౌంద‌ర్య‌మూ కూడా! ఇవాళ మంత్రి బాలినేని శ్రీ‌నివాస్ రెడ్డి పుట్టిన్రోజు. వైఎస్ జ‌గ‌న్ ఇలాకాలో చ‌క్రం తిప్పుతున్న నేత‌ల‌లో లేదా చక్రం తిప్పాల‌నుకున్న నేత‌ల‌లో ఈయ‌న ఒక‌రు అని రాయ‌డంలో సామాన్యం ఉందా లేదా ప్ర‌త్యేకత ఉందా... ప్ర‌కాశం జిల్లా రెడ్డి సామాజిక వ‌ర్గ నేత‌గా బాలినేనికి ఉన్న పేరు దృష్ట్యానో లేదా ఆయ‌న‌కు ఉన్న ప‌ర‌ప‌తి దృష్ట్యానో ఇవాళ ఆయ‌న కాస్త ప్ర‌త్యేకం. ఒంగోలు పోట్ల గిత్త లెక్కుండే ఆయ‌న పుట్టిన్రోజు సాక్షి కి కూడా మంచి పండుగ రోజు కావ‌డంలో విశేషం ఉంది కానీ సామాన్యం లేదు. విశేషం ఓ ఫుల్ పేజ్ యాడ్ లాంటిది.. క‌నుక ప్ర‌క‌టిత విశేషాల‌ను ఆనందిస్తూ చూస్తూ వాటికి పెన‌వేసుకుని ఉన్న ఆనందాల‌ను చూస్తూ ప‌రవ‌శిస్తూ ఉండ‌డ‌మే గొప్ప! ఆ విధంగా మంత్రి పుట్టిన్రోజు కార‌ణంగా సాక్షి కి ఓ గొప్ప ప్ర‌క‌ట‌న ద‌క్కింది మిన‌హా నాలాంటి సామాన్యుల‌కు మా ప్రాంత సామాన్యుల‌కు ద‌క్కింది ఏమీ లేదు.



మంత్రి బాలినేని అన‌గా వీర‌విధేయుడు. రాజ‌ధానుల‌పై ఏం మాట్లాడినా లేదా ఏం మాట్లాడ‌క‌పోయినా వీర విధేయుడు. సొంత ప్రాంతంలో రాజ‌ధాని పెడ‌తా అంటే పాపం ముందుకు రాలేక‌పోయిన విధేయత ఆయ‌న‌లో ఎన్న‌డూ ఉండ‌నే ఉంది. లేదంటే బాలినేని ఏరియాకు ద‌గ్గ‌రో దూర‌మో దొన‌కొండ ప్రాంతంలో ఓ రాజ‌ధాని వ‌చ్చేది. అదే ఆంధ్రుల రాజ‌ధాని అయ్యేది. మెగాస్టార్ చిరు కూడా సంతోషించేవారు అప్పుడు ! కానీ ఆయ‌న సంతోషానికి ఉపాశ‌న సంతోషానికి కూడా కార‌ణం అయినటువంటి రాజ‌ధాని అక్క‌డ రాలేదు. మంత్రి బాలినేని పేరు చెబితే ప్ర‌కాశం జిల్లాలో ఉన్న కేసీఆర్ ఫ్యాన్స్ గుర్తుకు వ‌స్తారు. ఎందుకంటే ఆ జిల్లాలో కేసీఆర్ మ‌నుషులు మంత్రి బాలినేని బాల్క‌నీ వైపు చూడ‌ర‌ని టాక్. ఇవి మిన‌హాయిస్తే బాలినేని నిర్వహిస్తున్న అట‌వీ శాఖ‌కు విద్యుత్ శాఖ కు ఆయ‌న చేసిన మేలేంటి అన్న‌ది త‌రువాత చెప్పుకోవాలి. ఎందుకంటే ట్రూ అప్ ఛార్జీలు అంటూ నానా గోల  చేసినోళ్ల‌కు వారి నోళ్లు మూయించి డ‌బ్బులు వెనక్కు ఇప్పించేసి ఇన్ఫినిటీ మోడ్ లో ఆనందాన్ని ఇచ్చేశారు ఆయ‌న వినియోగ‌దారుల‌కు.. ఆ విధంగా బాలినేని గ్రేట్.. గ్రేటెస్టు కూడా! వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ వ‌చ్చినా రాకున్నా అట‌వీ శాఖ ప‌రిర‌క్ష‌ణ‌కు లేదు లేదు అడ‌వుల ప‌రిర‌క్ష‌ణ‌కు ఆయ‌న చేసిన సాయం ఒక‌టి త‌ప్ప‌క గుర్తుకు వ‌చ్చి  ఆ విధంగా బాలినేనికి మ‌రో మారు మంత్రి ప‌ద‌వి అదే శాఖ‌లో ద‌క్క‌డం ఖాయం. ఆ విధంగా బాలినేని గ్రేటు మ‌రియు గ్రేటెస్టు. ఈ విధంగా ఆ విధంగా అని కాదు జ‌గ‌న్ స‌ర్ క్యాబినెట్ లో ఉన్నారంటే అన్ని విధాల ఆయ‌న గ్రేటు అని అనుకోవ‌డంతోనే ఆనందం మిగిలి ఉంది. లేదా మిక్కిలి ఆనందం కు కార‌ణాలు వెతికి ఉన్నాయి నాలో!



మరింత సమాచారం తెలుసుకోండి:

ycp