తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మధ్యాహ్న భోజన పథకానికి బ్రేకులు పడుతున్నాయి. నిత్యావసర ధరలతో పాటు కూరగాయల ధరలు అమాంతం పెరగడంతో ప్రభుత్వ స్కూల్ లో మిడ్డే మీల్స్ హెల్పర్స్ వారి సేవలను నిలిపివేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో పెట్టిన మిడ్డే మీల్స్ పథకం ఇప్పుడు అడుగంటిపోయే పరిస్థితికి వచ్చింది. రోజు రోజుకు పెరుగుతున్న కూరగాయల ధరలకు హెల్పర్లు కొనలేక వారంతా కూడా ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. నగరం లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలన్ని ఇప్పటికే మూతపడుతున్న పరిస్థితి. దీంతో ఇక మిడ్ డే మీల్స్ కూడా అయిపోవడంతో చాలామంది కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.

 రాష్ట్రంలో ప్రభుత్వ బడుల్లో మిడ్ డే మీల్స్ రాష్ట్ర ప్రభుత్వం సూచించిన మెనూ కచ్చితంగా పాటించాలని హెచ్ఎంలు, హెల్పర్లు చెబుతున్నారు. కూరగాయలు ఇతర నిత్యావసర సరుకుల రేట్లు పెరగడంతో మెనూ ప్రకారం ఎలా వండి పెట్టాలంటూ హెల్పర్లు ప్రశ్నిస్తున్నారు. దీనికి తోడు హెల్పర్ లకు మూడు నెలలుగా మిడ్ డే మీల్స్ బిల్లులు,గౌరవ వేతనాలు అందకపోవడంతో అప్పుచేసి వండి పెట్టాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో 26041 గవర్నమెంట్, లోకల్ బాడీ స్కూళ్లు ఉన్నాయి. వీటిలో సుమారు 21 లక్షల 50 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రభుత్వ మెనూ ప్రకారం సోమవారం కోడిగుడ్డు, కూరగాయలు, మంగళవారం పప్పు, ఆకుకూరలు, బుధవారం కోడిగుడ్డు, కూరగాయలు, గురువారం, శుక్రవారం కోడిగుడ్డు, పప్పు, కూరగాయలు, శనివారం వెజ్ బిర్యానీ పెట్టాలి. కానీ ధరల పెరుగుదలతో అందని బిల్స్ కారణంగా హెల్పర్ నాణ్యత ప్రమాణాలు గాలికి వదిలేస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కూరగాయల ధరలు కొండెక్కాయి. అధిక ధరల కారణంగా ప్రభుత్వం ఇస్తున్న బిల్స్ సరిపోవడం లేదని తాము నష్టపోతున్నామని హెల్పర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా అన్నింటి ధరలు పెరగడంతో స్కూళ్లలో వారానికి ఒకసారి మాత్రమే గుడ్డు పెడుతున్నారు. స్టూడెంట్ లో తల్లిదండ్రులు ప్రశ్నిస్తే రేట్లు పెరిగాయని సమాధానం ఇస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మధ్యాహ్న భోజనం వండాలంటే ఒక్కో స్టూడెంట్ పై పది రూపాయల వరకు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుందని నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా నెలకు కనీసం రెండు వేల నుంచి ఐదు వేలకు పైగా భారం తమపై పడుతుందని సేవలను ప్రేమించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: