ఏపీలో తెలుగుదేశం పార్టీ 2024 ఎన్నికల్లో గెలుస్తుందా ? చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి అవుతారా ?లోకేష్ కు రాజకీయ భవిష్యత్తు ఉంటుందా ? అన్న ప్రశ్నలు ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకపోతే ఆ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందని కూడా అంటున్నారు. ఇక వైసీపీ ఇప్పుడు ఎలాగూ ఐదేళ్ళ పాటు అధికారంలో ఉంది.. వచ్చే ఎన్నికలలో ఓడిపోయినా ఆ పార్టీకి వచ్చే నష్టమేమీ ఉండదు. అదే తెలుగుదేశం గెలవక పోతే మాత్రం ఆ పార్టీ దాదాపు డేంజర్ జోన్ లోకి వెళ్లి పోతుంది అని అంటున్నారు.

ఈ క్రమంలోనే చంద్రబాబు సైతం ఎన్నికలు మరో రెండున్నర సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఇప్పటి నుంచే కష్టపడుతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ కొట్టిన దెబ్బకు టీడీపీ ఇప్పటికీ కోలుకోలేదు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు టిడిపి నేతలు కూడా ఎంతో కష్టపడుతున్నారు. తెలుగుదేశం వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఏడు జిల్లాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. టిడిపిని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఆ జిల్లాలే ఆశ‌లు కలిగిస్తున్నాయి.

అవి ఏవో కాదు ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం - విశాఖపట్నం, గోదావరి జిల్లాలతోపాటు కృష్ణ - గుంటూరు జిల్లాలు... అనంతపురం జిల్లా మాత్రమే టిడిపికి ఇప్పుడు ఆశాకిరణంగా కనిపిస్తున్నాయి. ఈ జిల్లాల్లో టీడీపీ మెజార్టీ సీట్లు లాగేస్తే.... 2024 ఎన్నికల్లో ఆ పార్టీ గెలుపు దాదాపు ఖాయం అని చెప్పాలి. విజయనగరం నెల్లూరు తో పాటు కడప - కర్నూలు - చిత్తూరు - ప్రకాశం జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు.

అయితే ప్రకాశం జిల్లాలో మాత్రం పార్టీ ఇప్పుడే పుంజుకుంటున్న పరిస్థితి ఉంది. ఇక్క‌డ క‌ష్ట‌ప‌డితే మాత్రం పార్టీ మెజార్టీ సీట్లు గెలుచు కోవ‌చ్చు. మ‌రి చంద్ర‌బాబు ఎలాంటి ప్ర‌య‌త్నాలు చేసి ఈ జిల్లాల్లో పార్టీని నిల‌బెడ‌తారో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: