రాజకీయాల్లో మంచి మంచి అవకాశాలు అరుదుగా వస్తుంటాయి. అలా అరుదుగా వచ్చినప్పుడే అవకాశాలు సరిగ్గా ఉపయోగించుకోవాలి.. అప్పుడే రాజకీయంగా నాయకులు సక్సెస్ అవుతారు. ఆ అవకాశాలని సరిగ్గా ఉపయోగించుకోకపోతే  మాత్రం ఫెయిల్ అవ్వడం గ్యారెంటీ. ఇప్పుడు రాజకీయంగా టీడీపీ నేత గాలి భాను ప్రకాష్‌కు మంచి ఛాన్స్ వచ్చిందనే చెప్పాలి. అది కూడా తన ప్రత్యర్ధి రోజా రూపంలో భానుకు మంచి ఛాన్స్ వచ్చింది. అది ఎలా అంటే...రోజాకు సొంత పార్టీలోనే పోరు ఎక్కువైపోయింది. అసలు రెండోసారి గెలిచాక రోజాకు పెద్దగా సంతోషం లేదనే చెప్పాలి. ఇటు ఎలాగో మంత్రి పదవి రాలేదు...ఇచ్చిన ఏపీఐఐసీ ఛైర్మన్ పదవి మధ్యలోనే తీసేశారు.

సరే మంత్రి పదవి పక్కనబెడితే....అసలు సీటు ఉంటుందా లేదా అనే డౌట్ వస్తుంది. ఎందుకంటే నగరిలో రోజాకు వ్యతిరేకంగా కొందరు వైసీపీ నేతలు పనిచేస్తున్న విషయం తెలిసిందే. వేరే గ్రూపు సెపరేట్‌గా పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తుంది. దీంతో రోజా పలుసార్లు వైసీపీ అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేసింది. కానీ దీనిపై అధిష్టానం కూడా పెద్దగా స్పందించినట్లు లేదు. పైగా స్థానిక ఎన్నికల్లో రోజా వ్యతిరేక వర్గం ఏ విధంగా రాజకీయం నడిపిందో అందరికీ తెలిసిందే.

తాజాగా కూడా పలువురు నేతలు రోజాకు వ్యతిరేకంగా సమావేశం పెట్టి మరీ..రోజా వర్గంపై పరోక్షంగా విమర్శలు చేశారు. ఇక ఈ వర్గ పోరు వైసీపీకి బాగా మైనస్ అయ్యేలా ఉంది. నెక్స్ట్ ఎన్నికల్లో పార్టీకి డ్యామేజ్ జరిగేలా ఉంది. అయితే వైసీపీలోన్ మైనస్‌లని ఉపయోగించుకుంటే టీడీపీకి ప్లస్ అవుతుంది. కానీ ఆ దిశగా గాలి భాను పనిచేస్తున్నట్లు లేరు. ఇప్పటినుంచైనా ఆయన కాస్త ఫోకస్ చేస్తే...నెక్స్ట్ ఎలాగైనా నగరిలో టీడీపీ జెండా ఎగరవేయొచ్చు. గత రెండు పర్యాయాలుగా టీడీపీ స్వల్ప మెజారిటీలతోనే ఓడిపోవాల్సి వచ్చింది. కానీ ఈ సారి రోజాకు ఆ ఛాన్స్ ఇవ్వకూడదు అనుకుంటే..భాను ఈ ఛాన్స్ ఉపయోగించుకోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: