అణు ఆయుధాలు తయారు చేయకుండా ఆపేందుకు అటు ఇరాన్ పై ఇప్పటికే ఎన్నో సార్లు ఇజ్రాయిల్  దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇరాన్లోని అణు కర్మాగారాల పై దాడులు చేయడమే  కాదు ఏకంగా అణు శాస్త్రవేత్తలను సైతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో దారుణంగా చంపేసింది. అయితే ఇక ఇదంతా చేసింది ఇజ్రాయిల్ అన్న విషయం అందరికి తెలిసిందే. ఇప్పటికీ దీనికి సంబంధించిన ఆధారాలు మాత్రం ఎక్కడా లేవు. అయితే కేవలం ఇజ్రాయిల్  మాత్రమే కాదు. అటు ఇజ్రాయిల్ వెనకుండి నడిపించే అమెరికా అన్న విషయం తెలిసిందే.



 అమెరికా ప్రోద్బలంతోనే ఇజ్రాయిల్ ఇరాన్ లో ఉన్న ఆయుధ కర్మాగారాలకు పై దాడులకు పాల్పడుతూ ఉంటుంది. ఇకపోతే ఇటీవలే ఇజ్రాయిల్ అమెరికా మధ్య మరోసారి తీవ్ర స్థాయిలో చర్చలు జరిగాయి. అయితే ఈ చర్చలు ఎందుకు జరిగి ఉంటాయి అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇరాన్ భూగర్భంలో యురేనియం నిల్వను చేసినట్లు ఒప్పుకున్న కారణంగానే ఇక వాటిని ధ్వంసం చేసేందుకు ఈ చర్చలు జరిగి ఉంటాయని అంచనా వేశారు. మరోసారి ఇరాన్ ను టార్గెట్ చేసి దాడి చేయడానికి ఇలాంటి చర్చలు జరిగాయి అని కూడా అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో స్పందించిన ఇరాన్ ఏకంగా ప్రపంచ దేశాలకు ఓపెన్ వార్నింగ్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.



 మా సహనానికి హద్దు తొలగిపోతోంది.. మేము ఎంతో బాధ్యతగా ఉంటున్నాం.. ఇక ఇదే చేతగానితనంగా భావిస్తూ మీరు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారు అంటూ స్టేట్మెంట్ ఇవ్వడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ప్రస్తుతం ఇజ్రాయిల్ అమెరికా చర్చలు నేపథ్యంలోనే ఇరాన్ ఇలాంటి వ్యాఖ్యలు చేసింది అని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ అమెరికా ఇజ్రాయిల్ పేర్లను ప్రస్తావిస్తూ బాధ్యతగా వ్యవహరించకపోతే కోలుకోలేని దెబ్బ తీస్తాం అంటూ ఓపెన్ వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. ఇది కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: