గత ఎన్నికల్లో ఘోరమైన పరాజయాన్ని చవిచూశాక...టీడీపీ ఈ రెండున్నర ఏళ్లలో ఎక్కడైనా త్వరగా పుంజుకుంది అంటే...అది పశ్చిమ గోదావరి జిల్లా అనే చెప్పొచ్చు. తక్కువ సమయంలోనే పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ పికప్ అయింది. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ త్వరగా బలపడింది. ఈ రెండున్నర ఏళ్లలో వైసీపీకి ధీటుగా టీడీపీ వచ్చేసింది. అంటే గత ఎన్నికల్లో జిల్లాలో ఉన్న 15 సీట్లలో కేవలం 2 సీట్లు మాత్రమే గెలుచుకున్న టీడీపీ..ఇప్పుడు వైసీపీతో ఢీ అంటే ఢీ అనే పరిస్తితికి వచ్చింది.

అయితే కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం టీడీపీ పరిస్తితి ఇంకా మెరుగైనట్లు మాత్రం కనిపించడం లేదు. కొన్ని చోట్ల నాయకులు సరిగ్గా పనిచేయకపోవడం...వైసీపీ ఎమ్మెల్యేలపై పెద్దగా ప్రజా వ్యతిరేకత రాకపోవడం వల్ల టీడీపీకి ఛాన్స్ మాత్రం దొరకలేదు. వరుస రెండు ఎన్నికల్లో నాయకులని మార్చిన ఫలితం ఉండటం లేదు. మామూలుగా పోలవరంలో టీడీపీకి పెద్దగా బలం లేదు. కాకపోతే 2014లో టీడీపీ వేవ్‌లో పోలవరంలో మొడియం శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ ఐదేళ్లలో ఈయనపై తీవ్ర ప్రజా వ్యతిరేకత వచ్చింది.

దీంతో చంద్రబాబు, ఆయనని పక్కనబెట్టి...బొరగం శ్రీనివాసరావుని 2019 ఎన్నికల్లో నిలబెట్టారు....జగన్ గాలిలో బొరగం కూడా ఓడిపోయారు. అటు వైసీపీ నుంచి తెల్లం బాలరాజు భారీ మెజారిటీతో గెలిచేశారు. మామూలుగానే బాలరాజుకు పోలవరంలో ఫాలోయింగ్ ఎక్కువ. ఈయన జనంలో ఉండే నాయకుడు. ఇలాంటి నాయకుడుకు చెక్ పెట్టడం అంత సులువు కాదు.

ఇలాంటి నాయకుడుకు చెక్ పెట్టాలంటే టీడీపీ గట్టిగా కష్టపడాలి. కానీ ఆ స్థాయిలో టీడీపీ కష్టపడుతున్నట్లు కనిపిస్తోంది. అందుకే పోలవరంలో టీడీపీ ఏ మాత్రం పుంజుకోలేదు. వెస్ట్‌లో మిగిలిన నియోజకవర్గాల్లో టీడీపీ పేరు వినబడింది..నేతలు కనిపిస్తున్నారు...కానీ పోలవరంలో టీడీపీ కనిపించడం లేదు..ఇక్కడ నాయకులు అడ్రెస్ ఉండటం లేదు. ఈ పరిస్తితులని బట్టి చూసుకుంటే నెక్స్ట్ ఎన్నికల్లో కూడా పోలవరంలో బాలరాజు విజయానికి బ్రేకులు ఉండవని తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: