రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు జనసేన బాగానే ప్రయత్నిస్తుంది. కానీ ఆ పార్టీకి పెద్దగా అవకాశాలు మాత్రం దొరకడం లేదు. టీడీపీ, వైసీపీల మధ్య ఆ పార్టీకి అవకాశం దొరకడం కష్టమే. కాకపోతే కొన్ని నియోజకవర్గాల్లో తమ సత్తా ఏంటో చూపించాలని మాత్రం ఆ పార్టీ చూస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్తితుల్లో 175 నియోజకవర్గాల్లో జనసేనకు బలం లేదు. ఆ పార్టీకి 35-40 నియోజకవర్గాల్లోనే కాస్త బలం ఉంది. అది కూడా గెలిచెంత బలం కాదు. ఆ నియోజకవర్గాల్లో 25-30 వేల ఓట్లు ఆ పార్టీకి ఉన్నాయి.

ఇప్పుడు ఆ ఓటు బ్యాంకుని మరింత పెంచుకోవాలని జనసేన చూస్తుంది. ఇదే క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన ప్రత్యేకంగా ఒక ఏడు నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, ఏలూరు, ఆచంట నియోజకవర్గాల్లో పట్టు దక్కించుకోవాలని ఆ పార్టీ చూస్తుంది. గత ఎన్నికల్లో కూడా ఈ నియోజకవర్గాల్లో జనసేన కాస్త ఓట్లు బాగానే తెచ్చుకుంది. అయితే ఇప్పుడు ఈ స్థానాల్లో మరింతగా ఓటు బ్యాంకు పెంచుకుని సత్తా చాటాలని జనసేన చూస్తుంది. అయితే ఇక్క‌డ కాపు సామాజిక వ‌ర్గం ఓట‌ర్లు కూడా ఎక్కువే.

కాకపోతే ఇక్కడ జనసేన ఒంటరిగా పోటీ చేస్తే వీటిపై ఇంకా ఫోకస్ చేయాల్సిన అవసరముంది. కానీ ఇప్పుడున్న పరిస్తితుల్లో ఆ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే సత్తా చాటడం చాలా కష్టమని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ పార్టీకి పెద్దగా బలం పెరగలేదు. అలా అని వైసీపీ-టీడీపీలతో పోటాపోటిగా సీట్లు సాధించే సత్తా జనసేనకు లేదు. అంటే జనసేనకి కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు కూడా లేవు. అందుకే ఆ పార్టీ టీడీపీతో పొత్తు దిశగానే ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది. టీడీపీతో పొత్తు ఉంటే గెలవడం సులువు అవుతుంది. అప్పుడు ఈ ఏడు సీట్లలో ఒక మూడు సీట్లు వరకు జనసేనకు ఇచ్చే అవకాశం ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: