ఈ మధ్య నారా లోకేష్ ఊహించని ట్విస్ట్‌లు ఇస్తున్నారనే చెప్పాలి...అసలు మొన్నటివరకు టీడీపీలో ఆయనే నెంబర్ 1 అన్నట్లు రాజకీయం నడిచింది. ఏ జిల్లాలో చూస్తే ఆ జిల్లాలో లోకేష్ పర్యటించేసేవారు. నాయకులని ఎక్కడకక్కడ గైడెన్స్ చేస్తూ ముందుకు నడిచారు. చంద్రబాబు హైదరాబాద్‌లోని ఇంటికి పరిమితం కావడంతో...లోకేష్ అన్నీ తానై చూసుకున్నారు. అలాగే జగన్ ప్రభుత్వంపై దూకుడుగా విమర్శలు చేస్తూ వచ్చారు. ఇక ఒకానొక సందర్భంలో అరెస్ట్ అయ్యేవరకు వెళ్లారు. అలా పార్టీలో హడావిడి చేసిన లోకేష్ ఈ మధ్య ఏంటో పూర్తిగా పార్టీలో హల్చల్ చేయడం తగ్గించారు.

ఏదో సోషల్ మీడియా వరకు జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. అదే సమయంలో మంగళగిరి నియోజకవర్గంలో ఎక్కువ గడుపుతున్నారు. అయితే ఇలా చినబాబు సడన్‌గా పార్టీలో సైలెంట్ అయ్యి...మంగళగిరిలో తిరగడానికి కారణాలు లేకపోలేదనే చెప్పాలి. ఇప్పటికే చినబాబు పార్టీలో హడావిడి చేయడం వల్ల...ఆయనే నెక్స్ట్ సీఎం అభ్యర్ధి అనే ప్రచారం మొదలైంది. దీన్ని వైసీపీ మరింత అడ్వాంటేజ్‌గా తీసుకుని...టీడీపీ అధికారంలోకి వస్తే లోకేష్ సీఎం అవుతారనే ప్రచారం మొదలుపెట్టింది. దాని వల్ల జనంలో టీడీపీపై ఇంకా నెగిటివ్ పెరుగుతుందని, అసలు లోకేష్‌కు సీఎం అయ్యే అర్హతలు లేవని జనం అనుకోవాలని చెప్పి ఈ విధంగా ప్రచారం స్టార్ట్ చేశారు. దీనికి విరుగుడుగా టీడీపీ నేతలు రివర్స్ ఎటాక్ మొదలుపెట్టారు. మళ్ళీ చంద్రబాబే సీఎం అవుతారని చెబుతున్నారు. ఇటు చంద్రబాబు కూడా దూకుడుగా రాజకీయం చేయడం మొదలుపెట్టారు.

ఆయనే ఇప్పుడు అన్నీ వ్యవహారాలు చూసుకుంటున్నారు. ఇక లోకేష్‌ మంగళగిరిలో వరుసపెట్టి పర్యటిస్తున్నారు. గత ఎన్నికల్లో ఎలాగో ఘోరంగా ఓడిపోయారు...ఈ సారి ఖచ్చితంగా గెలవాలనే కసితో లోకేష్ మంగళగిరిలో పనిచేస్తున్నారు. ప్రజలని కలుస్తూ...వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుకెళుతున్నారు. అంటే నారా లోకేష్ ఇంకా మంగళగిరికే పరిమితవుతారని తెలుస్తోంది. ఆయన రాష్ట్ర రాజకీయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటారని అర్ధమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: