రాయలసీమలో టీడీపీకి కాస్త ఊరట కలిగించే అంశం ఏదైనా ఉందంటే...అది అనంతపురం జిల్లాలో పార్టీ కాస్త బలంగా ఉండటం. మొదట నుంచి సీమలో టీడీపీకి పెద్దగా కలిసిరాదు. కాకపోతే ఒక్క అనంతపురమే టీడీపీని నిలబెడుతూ వచ్చేది. ప్రతి ఎన్నికల్లోనూ అనంతలో టీడీపీకి మంచి ఫలితాలే వచ్చేవి...గత ఎన్నికల్లోనే కాస్త ఘోరమైన ఫలితాలు వచ్చాయి. అయితే ఘోరమైన ఓటమి వచ్చినా సరే అనంతలో టీడీపీ త్వరగానే పికప్ అయింది.

జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉంటే...దాదాపు సగం నియోజకవర్గాల్లో టీడీపీ పుంజుకున్నట్లు కనిపిస్తోంది. పైగా రెండు పార్లమెంట్ స్థానాల్లో కూడా టీడీపీ పికప్ అయినట్లు కనిపిస్తోంది. టీడీపీకి ఇంత త్వరగా పుంజుకోవడానికి అవకాశం ఇచ్చింది మాత్రం వైసీపీ ఎంపీలే అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడున్న ఇద్దరు వైసీపీ ఎంపీలు...ఇంతవరకు జిల్లాకు ఏం చేశారో క్లారిటీ లేదు. పైగా రాష్ట్ర ప్రయోజనాల కోసం...లోక్‌సభలో పోరాడిన సందర్భాలు ఎక్కువ కనిపించడం లేదు.

ముఖ్యంగా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ పరిస్తితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు...ఈయన ప్రజల్లో కంటే వివాదాల్లోనే ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. అసలు తెలిసేది ఏముంది...మాధవ్ ఎక్కువగా వివాదాలతోనే సహవాసం చేస్తున్నారు. సరే వివాదాల్లో ఉంటే ఉన్నారు...కనీసం తన పార్లమెంట్ స్థానంలో ప్రజల సమస్యలు తెలుసుకోవడం..ఎంపీ నిధులతో ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు ఏమన్నా చేస్తున్నారా? అంటే ఏమో అలాంటి కార్యక్రమాలు పెద్దగా కనిపించడం లేదని హిందూపురం ప్రజలే చెప్పే పరిస్తితి.

ఇటు అనంతపురం ఎంపీ తలారి రంగయ్య పనితీరుపై కూడా ప్రజలు అసంతృప్తిగానే ఉన్నట్లు కనిపిస్తోంది. ఏదో జగన్ గాలిలో గెలిచేశారు గానీ...ఈయనకు పార్లమెంట్ పరిధిలో సొంత బలం ఎక్కువ లేదు. ఇలా రెండు స్థానాల్లో ఫ్యాన్‌కు వ్యతిరేక గాలులు వీస్తున్నాయి...అందుకే రెండుచోట్ల టీడీపీకి కలిసొచ్చే పరిస్తితి. నెక్స్ట్ ఎన్నికల్లో ఈ రెండుచోట్ల వైసీపీకి అదిరిపోయే ట్విస్ట్‌లు మాత్రం వచ్చేలా ఉన్నాయి. ఏదేమైనా రెండుచోట్ల ఫ్యాన్ హవా నడవటం కాస్త కష్టమే అని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: