రాజకీయాల్లో ఏ నాయకుడికైనా మెయిన్ గోల్ పదవి. వారు రాజకీయంగా కష్టపడేది పదవులు కోసమే. పదవులే నాయకులకు అలంకారం...గౌరవం. అందుకే ఆ పదవుల కోసం నేతలు ఎప్పుడు పాకులాడుతుంటారు. అయితే పదవులు లేని నేతలకు అనుకున్న మేర గౌరవం దక్కదు. అలా గౌరవం దక్కనప్పుడు పదవుల కోసం నాయకులు వేరే మార్గాలు ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా సీనియర్ నాయకులు ఎలాంటి పదవులు లేకుండా ఖాళీగా ఉండాలంటే చాలా కష్టం.

ఇప్పుడు అదే కష్టం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇద్దరు సీనియర్ నేతలు పడుతున్నారు. పైగా ఆ ఇద్దరు కూడా పదవుల కోసమే అధికార టీఆర్ఎస్‌లోకి వచ్చారు. కానీ ఇప్పుడు ఆ పార్టీలోనే ఎలాంటి పదవి రాక ఖాళీగా ఉన్నారు. అలా పదవి కోసం ఎదురుచూస్తున్న నేతలు ఎవరో కాదు...ఒకరు చంద్రబాబుతో సన్నిహితంగా పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు..మరొకరు జగన్‌తో సన్నిహితంగా పనిచేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

తుమ్మల దశాబ్దాల పాటు టీడీపీలో పనిచేసిన విషయం తెలిసిందే. కానీ తెలంగాణలో టీడీపీ ఉనికి కోల్పోవడంతో టీఆర్ఎస్‌లోకి వెళ్ళిపోయారు. అలాగే ఎమ్మెల్యేగా, మంత్రిగా కూడా మొదట్లోనే ఛాన్స్ కొట్టేశారు. కానీ 2018 ఎన్నికల్లో తుమ్మల ఓడిపోయారు. పైగా తనపై గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డిని టీఆర్ఎస్‌లోకి తీసుకొచ్చారు. సరే ఎమ్మెల్సీ ఇచ్చి, మంత్రి పదవి ఇస్తారని అనుకుంటే...కనీసం ఎమ్మెల్సీ కూడా ఇవ్వలేదు. ఇక నెక్స్ట్ ఎన్నికల్లో సీటు విషయంలో కూడా డౌట్ ఉంది.

ఇటు 2014లో వైసీపీ నుంచి ఖమ్మం ఎంపీగా గెలిచిన పొంగులేటి...సేమ్ తెలంగాణలో వైసీపీ కనుమరుగు కావడంతో టీఆర్ఎస్‌లోకి వచ్చేశారు. అలా టీఆర్ఎస్‌లోకి వచ్చిన పొంగులేటికి 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ సీటు ఇవ్వలేదు. దీంతో రాజ్యసభ గానీ, ఎమ్మెల్సీ గానీ వస్తుందని అనుకున్నారు. కానీ ఏ పదవి రాలేదు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అటు తుమ్మల పరిస్తితి అంతే...ఇక ఇద్దరు సమయం చూసుకుని కేసీఆర్‌కు షాక్ ఇచ్చే అవకాశం కూడా ఉందని ప్రచారం జరుగుతుంది.  మరి బాబు, జగన్‌ సన్నిహితులు కేసీఆర్‌కు షాక్ ఇస్తారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr