కేసీఆర్ తమిళనాడులో పర్యటిస్తున్నారు. శ్రీరంగం ఆలయాన్ని సందర్శించారు. శ్రీరంగం నుంచి మ్యాటర్ ను రాజకీయ రంగానికి టర్న్ చేశారు కేసీఆర్. మామూలు సమయంలో ఇది మామూలు విషయమే అయినా ముందురోజు ఆలయం సందర్శనం, మరుసటి రోజు స్టాలిన్ తో కరచాలనం రాజకీయంలో హీట్ పుట్టిస్తోంది. బెంగాల్ లో విజయం తర్వాత దీదీ దేశమంతా తిరిగేస్తున్నారు. బిజెపి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దొరకని వాళ్ళని వెంబడిద్దాం,దొరికిన వాళ్ళను వెంటేసుకుని తిరుగుదాం ఇదే కొత్త ఫ్రంట్ రాజకీయం.

 కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్లందరినీ పార్టీలో చేర్చుకున్న దీదీ మిగతా పార్టీల నేతలకు గాలం వేస్తున్నారు. ఉత్తరాదిన దీదీ, దక్షిణాదిన కేసీఆర్ ఏది ఏమైనా రాజకీయ మాత్రం హిట్ గా కనిపిస్తోంది. ఇప్పుడు స్టాలిన్ తో కేసీఆర్ సమావేశం కావడం ఆసక్తి రేకెత్తిస్తోంది. మమతా,కేసీఆర్, స్టాలిన్ ఈ ముగ్గురు గురించి ప్రస్తావిస్తే కామన్ గా వినిపించే పేరు పీకే అలియాస్ ప్రశాంత్ కిషోర్. మరి పీకేనే వీరి వెనకుండి నడిపిస్తున్నారా?త్వరలోనే  బీజేపీ, కాంగ్రెసేతర కూటమి ఏర్పడుతుందా?  అసలు కాంగ్రెస్ అనేది లేకుండా థర్డ్ ఫ్రంట్ సాధ్యమేనా? థర్డ్ ఫ్రంట్ కు సంబంధించి దీదీ కంటి ముందు కనిపిస్తున్నా వెనకుండి నడిపిస్తుంది మాత్రం ప్రశాంత్ కిషోరే అన్నది రాజకీయం ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్న ఎవరికైనా అర్థమవుతుంది. కూటమికి సంబంధించి ప్రశాంత్ కిషోర్ బ్లూ ప్రింట్ కూడా సిద్ధం చేశారని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ లేకపోయినా బిజెపి వ్యతిరేక కూటమి ఏర్పాటు చేయొచ్చని పీకే పట్టుదలగా అంటున్నారు.

1984 తర్వాత  కాంగ్రెస్ ఒంటరిగా గెలవలేదని చిన్నాచితక పార్టీలను కలుపుకొని సర్కారును ఏర్పాటు చేసిందన్నది ఆయన వాదన. థర్డ్ ఫ్రంట్ లో ఉంటాయనుకున్న పార్టీలకు కామన్ ఎజెండా అనేది లేదు. పైగా ఎవరికి వారు తామే ప్రధాని అన్న ఆలోచనలో ఉన్నారు. ఇదంతా ఎలా ఉన్నా ఇప్పుడు థర్డ్ ఫ్రంట్ కు సంబంధించిన పార్టీల్లో చాలావరకు ఏదో ఒక సమయంలో బీజేపీతో ప్రత్యక్షంగానో,పరోక్షంగానో మంచి సంబంధాలు కొనసాగించాయి. ప్రాంతీయ పార్టీలన్నీ కూటమిగా ఏర్పడితే అది బిజెపికి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓట్లు చీలి ఒక రకంగా కాంగ్రెస్ కే దెబ్బ పడే ప్రమాదం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: