లోప‌ల అభిమానాలు వేరు బ‌య‌ట రాజ‌కీయ అవ‌స‌రత‌లు వేరు..ఈ రెండూ కేసీఆర్ ను ప్ర‌భావితం చేసిన విష‌యాలు.. కేసీఆర్ ను నియంత్రితం చేసిన విష‌యాలు కూడా కావొచ్చు. అందుక‌నే బ‌య‌టకు ఎన్టీఆర్ పేరు చెప్ప‌న‌ప్ప‌టికీ ఆయ‌న‌కు ఖ‌మ్మం, హై ద్రాబాద్ కు చెందిన క‌మ్మ సామాజిక‌వ‌ర్గాల నేత‌లంటే బాగా ఇష్టం..వారిని దూరం చేసుకోలేరు. అలానే ఒక‌నాటి అభిమానం కొడు కు(కే తార‌క రామారావు)కు పేరు పెట్టేంత వ‌ర‌కూ ప‌రిమితం చేసి ఆ త‌రువాత దాని కొన‌సాగింపును మాత్రం వ‌దిలేశారు కొన్ని సా ర్లు కొన్ని సంద‌ర్భాల్లో..అందుకు కార‌ణం ఎన్టీఆర్ ను స‌మైక్యాంధ్ర‌కు ఐకాన్ గా చూడ‌డ‌మే! ఆ గిట్ట‌ని త‌న‌మే ఆయ‌న‌కు కాస్త చెడ్డ పేరు ఆంధ్రాలో తీసుకుని రావొచ్చు. కానీ అవ‌స‌ర‌త‌ల‌ను అటుంచితే ఎన్టీఆర్ కూడా ఆయ‌న‌కు కావాల్సిన వారే! ఇదంతా రాజ‌కీ య ప్రాభావం పెంచుకునేందుకే..త‌గ్గించుకునేందుకు కాదు! ఆ విధంగా చూసుకుంటే ఎన్టీఆర్ పేరు బ‌య‌ట‌కు స్మ‌రించ‌డం ఆయ న‌కు కొంత న‌చ్చక పోవ‌చ్చు. అదే పొట్టి శ్రీ‌రాములు విష‌య‌మై ఆయ‌న అలా చూడ‌రు. ఒక త్యాగ నిర‌తికి సంకేతంగానే భావిస్తు న్నారు ఇప్ప‌టికీ ఆయ‌నను. క‌నుక క‌మ్మ సామాజిక వ‌ర్గ నేత‌లు బ‌లంగా ఉన్న ఖ‌మ్మం, హైద్రాబాద్ నేత‌ల‌పై ఆయ‌న‌కు విప‌రీ తం అయిన మ‌క్కువ ఉంది. అందుకు కార‌ణం వారికి ఉన్న ఆర్థిక మూలాలే ! ఇక్కడ ఆర్థిక స్వ‌తంత్ర‌త‌కు సంకేతం, మూలం వై శ్యులు అయితే అక్క‌డ క‌మ్మ సామాజిక‌వ‌ర్గ నేత‌లు కావ‌డం విశేషం. అందుకే ఆయ‌న‌కు ఈ రెండు వ‌ర్గాలు అవ‌స‌రాల రీత్యా  గు ర్తుకు రావ‌డంలో త‌ప్పేం లేదు.


ఇద్ద‌రే ఇద్ద‌రు నాయ‌కులు..అటు పొట్టి శ్రీ‌రాములు ఇటు ఎన్టీఆర్. వైశ్య సామాజిక వ‌ర్గ నేత‌గా ఆయ‌న మ‌ర‌ణానంత‌రం సంబంధిత గుర్తింపు పొందితే క‌మ్మ సామాజిక వ‌ర్గ నేత‌గా రాజ‌కీయం న‌డిపిన ఎన్టీఆర్ ఎన్న‌టికీ ఆంధ్రుల‌కు ఆరాధ్యుడే. జ‌గ‌న్ ఈ ఇద్ద‌రినీ స‌మ‌యోచితంగా వాడుకుంటారు. కానీ కేసీఆర్ కొన్ని సంద‌ర్భాల్లో అయినా పొట్టి శ్రీ‌రాములుకు  ప్రాధాన్యం ఇస్తారు కానీ ఎన్టీఆర్ ను అస్స‌లు త‌లుచుకోరు అన్న‌ది సీనియ‌ర్ ఎన‌లిస్ట్ నాంచార‌య్య మెరుగుమాల మాట. సామాజిక చైత‌న్యం రెండు వ‌ర్గాల‌కూ ఉన్నా కూడా జ‌గ‌న్ కు అవ‌సరం రీత్యా ఎన్టీఆర్ గుర్తుకు వ‌స్తారు. అలానే ఆయ‌న ఆత్మ‌గౌర‌వ నినాదం కూడా గుర్తుకు వ‌స్తుంది. అదే సంద‌ర్భంలో కొన్ని విష‌యాల్లో ఎన్టీఆర్ ను అనుకరించాల‌న్న ఆలోచ‌న కూడా ఉంటుంది. కానీ ఏదో ఒక వ‌ర్థంతి వేళో జ‌యం తి వేళో పొట్టి శ్రీ‌రాములును త‌లుచుకుని వ‌దిలేస్తారు. నెల్లూరు జిల్లాకు ఎలా అయితే పొట్టి శ్రీ‌రాములు నెల్లూరు అని పేరుపెట్టారో, అలానే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాల‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌తిపాద‌న ఉంది. అయితే రాజ‌కీయ అవ‌స‌ర‌త‌ల రీత్యా క‌మ్మ సామా జిక వ‌ర్గ నేత‌లు అన్నీ ఇంత‌గా ప‌ట్టించుకోరు క‌నుక ఆ ప్ర‌తిపాద‌న చంద్ర‌బాబు హ‌యాంలో కూడా వ‌ర్కౌట్ కాలేదు. ఇక‌పై కాబోదు కూడా.. ఎన్టీఆర్ అనే బ్రాండ్ వ‌దులుకుని చంద్ర‌బాబు రాజ‌కీయం చేస్తే, ఎన్టీఆర్ అనే బ్రాండ్ కొన్ని సార్లు వాడుకుని జ‌గ‌న్ రాజ‌కీ యం చేసిన ఘ‌ట‌న‌లు అయితే సాక్షి పేప‌ర్ సాక్షిగా ఉన్నాయి..క‌నుక అవ‌స‌రం అయితే ఆర్య వైశ్యులు, క‌ళింగ వైశ్యు లును అటు జ‌గ‌న్ ఇటు  కేసీఆర్ వాడుకుంటారు. కానీ క‌మ్మ సామాజిక‌వ‌ర్గంను మాత్రం కేసీఆర్ కేవలం త‌న  ప‌రిధి మేర‌కు ఇంకా చెప్పాలంటే కొన్ని జిల్లాల వ‌ర‌కూ మాత్ర‌మే వాడుకుని, త‌రువాత వ‌దిలేసిన దాఖ‌లాలే ఎన్నో! అదే వైశ్య సామాజిక‌వ‌ర్గం త‌న కు ఆర్థిక మ‌ద్ద తు ఇస్తుంద‌న్న చిన్న‌పాటి స్పృహ నాటి ఉద్య‌మ కాలంలో కేసీఆర్ కు ఉంద‌న్న‌ది ఆ ఎన‌లిస్టు నాంచార‌య్య చెబుతున్న మాట. ఓ విధంగా ఉద్య‌మ కాలంలో క‌మ్మ సామాజిక వ‌ర్గం ఎటున్న‌దో కూడా తేల‌ని ప‌రిణామాలు ఎన్నో! ఆ విధంగా చూసుకున్నా కేసీ ఆర్ క‌మ్మ‌ల‌కు పెద్ద‌గా ప్రాధాన్యం ఇవ్వ‌కున్నా పైకి మాత్రం వారిని పెద్ద‌గా ఏమీ అన‌కున్నా ఎన్టీఆర్ పేరును మాత్రం స్మ‌రించ‌రు అ ని చాలా మంది అంటారు..ఇది కూడా ఓ చోట చ‌దివిన మాట. ఓ చోట ప్ర‌స్తావ‌నకు నోచుకున్న మాట. అదే శ్రీ‌కాకుళం నేత‌ల రాజ కీయాల‌కు ద‌గ్గ‌ర‌గా ఉండే కేసీఆర్ వైశ్యుల‌కు కొన్ని సంద‌ర్భాల్లో ప్రాధాన్యం ఇస్తే, జ‌గ‌న్ మాత్రం రెండు వ‌ర్గాల‌నూ అవ‌స‌రాల‌కు అ నుగుణంగా వాడుకుని త‌రువాత వదిలేశార‌న్న ఆరోప‌ణ‌లు అయితే మోస్తున్నారు. ఇక జిల్లాల పేర్ల‌కు వ‌స్తే శ్రీ‌కాకుళం జిల్లాకు ఎ ర్ర‌న్న పేరు పెడితే కేసీఆర్ సంతోషిస్తారు కానీ అదే త‌న పూర్వాశ్ర‌మ నేత ఎన్టీఆర్ పేరును ఆయ‌న దగ్గ‌ర ప్ర‌స్తావిస్తే మాత్రం దిగ్గున లేస్తార‌ని కూడా ఓ వినికిడి.



ప్రాంతాలు వేర‌యినా నాయ‌కులు ఆర్థిక మూలాలు బాగుంటేనే బాగుప‌డ‌తారు. ఆర్థిక మూలాలు బాగా ఉన్న కుటుంబాల‌ను త మ వెంటే తిప్పుకునేందుకు నాయ‌కులంతా బాగా ఇష్ట‌ప‌డ‌తారు. రాజకీయంగా చైత‌న్యం ఉన్న కుటుంబాలు కొన్ని ఈ పనినే ఇ ష్టంగా చేసుకుంటాయి. మెంటార్ షిప్ ను పాటిస్తాయి. ధ‌ర్మాన‌ను కానీ ఎర్ర‌న్న‌ను కానీ మా జిల్లాలో బాగా ద‌గ్గ‌ర‌గా చూసుకుని హా యిగా వారి ఆర్థిక వ్య‌వ‌హారాల‌ను చ‌క్క‌దిద్దేది ఆ రోజు అయినా ఈ రోజు అయినా కోమ‌ట్లే! ఆర్య వైశ్యులు క‌న్నా క‌ళింగ వైశ్యులు సామాజికంగానూ కాస్తా ఆర్థిక పరంగానూ మెజార్టీ వ‌ర్గం. క‌నుక క‌ళింగ కోమ‌ట్లు జ‌గ‌న్ కు ఇంకాస్త ఎక్కువ ద‌గ్గ‌ర‌. ఆర్య వైశ్యులు కూడా అదే కోవ‌లో ఉంటారు కానీ వీరంత కాదు. రాజ‌కీయంలో భాగంగా అధికారం ఎటు ఉంటే అటు వైపు త‌మ మార్గాన్ని మ‌ళ్లిం చుకునే వ్య‌క్తులు అన్ని సామాజిక‌వ‌ర్గాల్లోనూ ఉంటారు క‌నుక అందుకు కులాలు అతీతంగా ఉండ‌వు.. కులాల‌లో ఉండే వ్య‌క్తులు కూడా అతీతంగా ఉండ‌రు. మా ప్రాంతం అంటే శ్రీ‌కాకుళంకు అటు తెలంగాణ‌కు ఇలాంటి పోలిక‌లే ఉండి ఉండాలి. కేసీఆర్ కు ఈ ప్రాంతం తో ఉన్న బంధం కొద్దిపాటిదే అయినా ఆయ‌న కూడా కొన్ని సార్లు ఎర్ర‌న్న మాదిరిగానో ధ‌ర్మాన మాదిరిగానో న‌డుచుకుం టూ ఉంటార‌ని అనిపిస్తుంటుంది. ప‌క్కా జాగ్ర‌త్త‌లు తీసుకుని రాజ‌కీయం న‌డ‌ప‌డంలో ఆ ఇద్ద‌రూ ఉద్దండులు..అలానే కేసీఆర్ కూ డా! ఇక ఇవాళ పొట్టి శ్రీ‌రాములు వ‌ర్థంతి వేళ కూడా కేసీఆర్ కానీ అటు జ‌గ‌న్ కానీ బాగానే శ్ర‌ద్ధ వ‌హించి నివాళులు అర్పించారని వార్త‌లొస్తున్నాయి. ఈ విధంగా చేయ‌డం త‌ప్పు కాదు కానీ రాజ‌కీయ అవ‌స‌ర‌త‌ల‌ను వినియోగించుకుని నివాళి కార్య‌క్ర‌మాల ఏ ర్పాటు ఎంత మాత్రం మంచిది కాదు.


 


మరింత సమాచారం తెలుసుకోండి: