గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ స్థానాలు ఉంటే...టీడీపీ దృష్టిలో 16 స్థానాలే ఉంటాయని చెప్పొచ్చు. ఎందుకంటే మాచర్ల నియోజకవర్గాన్ని టీడీపీ పెద్దగా కౌంట్‌లో తీసుకోవాల్సిన అవసరం లేదు. అసలు మాచర్లని టీడీపీ ఎందుకు కౌంట్‌లోకి తీసుకోవాల్సిన అవసరం లేదో చెప్పాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే అక్కడ టీడీపీ పార్టీకి ఉనికి లేదు. కాకపోతే పేరుకు అక్కడ పార్టీ ఉంది కాబట్టి, పోటీలో ఉంటుందని చెప్పొచ్చు. ఏదో పోటీ చేయడమే గానీ...గెలుపు మాత్రం టీడీపీకి దక్కడం చాలా కష్టం. అది ఇప్పటికే పలు మార్లు రుజువైంది.

అయితే పార్టీ పరిస్తితి మెరుగవ్వకుండా ఎన్ని ఎన్నికల్లో పోటీ చేసిన మాచర్లలో టీడీపీ గెలవడం గగనం. పైగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి మాస్ ఫాలోయింగ్ నాయకులకు చెక్ పెట్టడం సులువు కాదు. నియోజకవర్గంలో పిల్లాడి దగ్గర నుంచి ముసలోడు వరకు....పిన్నెల్లి అంటే ఏంటో తెలుసు. పిన్నెల్లి..రాజకీయంగా ప్రత్యర్ధులకు చెక్ పెట్టొచ్చు గానీ...ప్రజాప్రతినిధిగా ఎప్పుడు ప్రజలకు అండగానే ఉంటారు. అసలు పిన్నెల్లి ప్రతి ఇంట్లో సొంత మనిషిలా ఉంటారు. అలాంటప్పుడు పిన్నెల్లికి చెక్ పెట్టాలంటే టీడీపీ ఎంత కష్టపడాలో అర్ధం చేసుకోవచ్చు.

పంచాయితీ, పరిషత్ ఎన్నికల్లో వన్‌సైడ్‌గా విజయాలు సాధించడానికి, అసలు మాచర్ల మున్సిపాలిటీని పూర్తిగా ఏకగ్రీవం చేసుకున్నారంటే పిన్నెల్లికి ఎంత ప్రజా బలం ఉందో అర్ధం చేసుకోవచ్చు. అలా ప్రజా బలం ఉన్న నేతని ఓడించడం అనేది సాధ్యమయ్యే పని కాదు.

ఇక ఆయనకు మించి ప్రజలని ఆకర్షిస్తే గానీ టీడీపీ గెలవగలదు. అయితే టీడీపీలో అలాంటి నాయకుడు 1999 నుంచి దొరకడం లేదు. అందుకే అప్పటినుంచి మాచర్లలో టీడీపీ జెండా ఎగరడం లేదు. ఇప్పుడు చలమారెడ్డి టీడీపీ బాధ్యతలు చూసుకుంటున్నారు గానీ, ఆయన కూడా ఎఫెక్టివ్‌గా పనిచేస్తున్నట్లు లేరు. అంటే పిన్నెల్లిని ఓడించడం కష్టమని లైట్ తీసుకున్నారో లేక...మాచర్ల ప్రజలు టీడీపీకి మద్ధతు ఇవ్వడం కష్టం అనుకున్నారో తెలియదు గానీ..చలమారెడ్డి అయితే లైట్ తీసుకున్నారు. మొత్తానికైతే మాచర్లని టీడీపీ కౌంట్‌లో పెట్టుకోవాల్సిన అవసరం లేదనే చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: