కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి అధ్యక్షుడు వచ్చిన తర్వాత చాలా మార్పు వచ్చిందని చెప్పవచ్చు. ఆయన రాజకీయ వ్యూహంతో ముందుకు పోతున్నారు. సీనియర్లను జూనియర్లను అందరినీ కలుపుకొని పార్టీని ఎలాగైనా గద్దె ఎక్కించాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్లో పూర్వం ఉన్నటువంటి సీనియర్ నాయకులను కలుస్తున్నారు. అలాగే కాంగ్రెస్ నుండి ఇతర పార్టీలకు వెళ్లిన టువంటి  నాయకులను కలిసి పార్టీలోకి ఆహ్వానం పలుకుతున్నారు. ఈ విధంగా ఆయన వ్యూహాలు రచిస్తూ ముందుకెళుతున్నారు అని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే  టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి రాజ్యసభ సభ్యుడు డి ఎస్ సొంతగూటికి రానున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. గత కొంత కాలంగా టిఆర్ఎస్ కు దూరంగా ఉంటున్న డిఎస్ మరికొద్ది రోజుల్లో పదవీకాలం ముగియడంతో  ఆయన హస్తం గూటికి  చేరుతున్నట్టు సమాచారం. అయితే ఆయనతో కాంగ్రెస్ అధిష్టానం మంతనాలు కూడా జరుపుతోందని తెలుస్తోంది.
 
 ఇప్పటికే సోనియాను డిఎస్ మర్యాదపూర్వకంగానే కలిసినట్లు తెలుస్తోంది. అయితే శుక్రవారం రోజున డి ఎస్ పార్టీలో చేరనున్నట్టు తెలుస్తోంది. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా పీసీసీ చీప్ గా పని చేశారు. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సమయంలోనే, తర్వాత ఆయన 2014లో కాంగ్రెస్ సముచిత స్థానం ఇవ్వటం లేదని టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లారు. సీనియర్ నాయకుడైన డి.శ్రీనివాస్  టిఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలు చేపడుతున్నారని కెసిఆర్ కు తెలియజేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన కొద్దిరోజులుగా టిఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న డి శ్రీనివాస్, కాంగ్రెస్ లో చేరేందుకు నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. దీని కోసమే ఆయన సోనియాతో భేటీ అవుతారని  సమాచారం. ఈ విధంగా రేవంత్ రెడ్డి తనదైన వ్యూహంతో ఇతర పార్టీలో ఉన్నటువంటి అసంతృప్త నేతలను  కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. వీరితో పాటుగా కాంగ్రెస్ నుంచి వేరే పార్టీలకు వలస వెళ్లిన  నాయకులను కూ డా పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: