చైనా గొప్పదనం అందరికి అర్ధం అయిపోతుంది. అది అందరికి అప్పులు ఇచ్చి, వాళ్ళను దివాళా దిశగా నడిపిస్తున్నదని ఆయా దేశాలు కూడా ఇప్పుడిప్పుడే కళ్ళు తెరుస్తున్నాయి. పాక్ ఒక్కదానిని చూస్తే చాలు, అది అర్ధం అవుతుంది. కానీ ప్రతివారికి సొంత అనుభవం వస్తేనే కానీ, చైనా కుట్రపూరిత ఆలోచనల లో అర్ధం తెలిసిరావడం లేదు. అందుకే ఒకదానివెంట మరొకటి దానిని పెద్దన్నగా అనుకుంటూ మోసపోతున్నాయి. పాక్ కు మరో దిక్కు లేని స్థితి వచ్చేసింది కాబట్టి దానికి వేరే దారి లేదు. ఆ స్థితి తమకు వచ్చేవరకు ఎదురు చూడకుండా వీలైనంత త్వరగా చైనా బారి నుండి తప్పించుకు తిరుగుదామని ఆయా దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అలా చేస్తున్న వారిలో కొందరు బయటపడుతున్నారు, మరికొందరు సమయం చూసి తప్పుకుంటున్నారు.

ఏది ఏమైనా చైనా ప్రపంచంలో ఒంటరిగా మిగిలిపోతుంది అన్నది మాత్రం నిజం. మొదటిసారి కరోనా ముప్పు దానివల్లనే అని అర్ధం అవుతుంది, రెండో సారి కూడా ఆ ప్రమాదం వచ్చింది, ఇప్పుడు మరోసారి కొత్త వేరియంట్ రూపంలో వస్తుంది. ఇలా అది పెట్రేగిపోయినంత కాలం ప్రపంచ దృష్టిలో చైనా దోషిగా బలపడుతూనే ఉంటుంది. తాజాగా దాని కోరలలో నుండి తప్పించుకున్న మరో దేశం ఇరాన్. అక్కడ ప్రభుత్వం మార్పుతో ఈ పంధా కొనసాగుతుంది. గత ప్రభుత్వం లో ఉన్నవారు చైనాను చూసుకొని అమెరికాతో అన్నిటికి పట్టింపులకు పోయారు. దాని ఫలితమే అనేక ఆంక్షలు. కరోనా సమయంలో ఆ ఆంక్షలు తట్టుకోవడం అంత సులభతరం కాదు అని ప్రస్తుత ప్రభుత్వం గ్రహించింది.

ప్రస్తుత ఇరాన్ ప్రభుత్వం అమెరికా ఆంక్షల కు తలోగ్గడానికి సిద్దపడింది. గత ప్రభుత్వంలో అడుగడుగునా అణుప్రయోగాలు జరుగుతున్నాయా అనేది పరిశీలించడానికి సీసీ కెమెరాలు అమర్చారు. బేధాభిప్రాయాలు రాగానే, ప్రభుత్వం వాటిని తొలగించడం కూడా జరిగింది. ఇప్పుడు మళ్ళీ వాటిని యధాస్థానాలలో ఇరాన్ ప్రభుత్వం అమర్చుతుంది. దేశ భవిష్యత్తు దృష్ట్యా చైనా లాంటి ఒక్కదేశాన్ని నమ్ముకోవడం పనికిరాదని, ఇతర దేశాలతో స్నేహభావంతో ముందుకు పోవడం అవసరం అని ప్రస్తుత ప్రభుత్వం గ్రహించడంతో, ఈ సానుకూల నిర్ణయం తీసుకున్నారు. మరోసారి అమెరికా తో స్నేహబంధాన్ని పునరుద్ధరించుకోవడానికి సిద్ధం అవుతున్నారు. అయితే ఇదంతా అభివృద్ధి కోసమేనా లేక కరోనా వలన వస్తున్న సంక్షోభాలు తట్టుకోలేక ఇరాన్ ప్రభుత్వం కొత్త కధలు చెపుతుందా అనేది తెలియాల్సి ఉంది. దీనిపై అమెరికా స్పందించాల్సి ఉంది. ఇప్పటికే అమెరికాకు, ఇరాన్ అండర్ గ్రౌండ్ లలో అణు పరీక్షలు చేస్తున్నట్టుగా అనుమానం ఉన్నది. దానిని నివృత్తి చేసేవరకు ఈ మైత్రి ప్రశ్న లాగానే ఉంటుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: