ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. ఓ వైపు అమరావతి రైతుల పాదయాత్రలు, మరో వైపు అధికార పార్టీకి హైకోర్టులో ఎదురుదెబ్బలు, చివరికి సినీ పరిశ్రమ నుంచి కూడా ప్రభుత్వానికి ఇబ్బందులు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ప్రతిపక్ష నేతలు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ముప్పేట దాడి చేస్తూ... వైసీపీని ఇరుకున పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఓ వైపు తెలుగుదేశం పార్టీ... మరోవైపు జనసేన పార్టీ, ఇంకో వైపు భారతీయ జనతా పార్టీ, ఇక అమరావతి రైతుల వ్యవహారం, అటు హైకోర్టు వ్యవహారం... ఇటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి... ఇన్ని రకాలుగా జగన్ సర్కార్‌ను ఇబ్బంది పెట్టేందుకు అన్నివర్గాలు ప్రయత్నం చేస్తున్నాయి. ఇక సొంత పార్టీకి చెందిన నరసాపురం పార్లమెంట్ సభ్యులు రఘురామ కృష్ణంరాజు కూడా అధినేత జగన్‌ను టార్గెట్ చేసుకుని ఘాటుగా విమర్శలు చేస్తూనే ఉన్నారు.

ఇక రాష్ట్రానికి అమరావతి మాత్రమే రాజధాని అంటూ సేవ్ అమరావతి పేరుతో న్యాయ స్థానం టూ దేవస్థానం అంటూ మహా పాదయాత్ర చేపట్టారు అమరావతి ప్రాంత రైతులు. నాలుగు జిల్లాల మీదుగా సాగిన ఈ యాత్ర... చివరికి తిరుమలేశుని దర్శనంతో ముగిసింది. ఆ తర్వాత తిరుపట్టి పట్టణంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు రైతులు. ఈ సమావేశానికి అధికార పార్టీ నేతలు మినహా.... మిగిలిన అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు. టీడీపీ తరఫున చంద్రబాబు నాయుడు స్వయంగా హాజరయ్యారు. అదే సమయంలో వైసీపీ రెబల్ ఎంపీ ఆర్ఆర్ఆర్ కూడా సభకు హాజరయ్యారు. ఈ సభ ప్రాంగణంపైకి చేరుకున్న రఘురామకు  రైతులు ఘన స్వాగతం పలికారు. అటు రఘురామ కూడా తన ప్రసంగంలో జై అమరావతి అంటూ రైతులకు మద్దతు తెలిపారు. అమరావతిని రాజధాని కాకుండా ఎవరూ అడ్డుకోలేరని తేల్చేశారు. ఇదే సమయంలో చంద్రబాబు వేదికపైకి రాగానే... ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. చంద్రబాబు దగ్గరకు నేరుగా వెళ్లిన రఘురామ.. ఆయనను ఆలింగనం చేసుకున్నారు. సభ మొత్తానికి ఇదే హైలెట్ సీన్.


మరింత సమాచారం తెలుసుకోండి:

RRR