ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికారం చేప‌ట్టిన నాటి నుంచి ప్ర‌తిప‌క్షాలు ఊహించ‌ని రీతిలో సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తూ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి పాల‌న‌ను అందిస్తున్నారు. ఇదే ఊపులోనే 2024 లోనూ అధికారం చేజిక్కించుకోవాల‌ని వ్యూహాత్మ‌కంగా ముందుకు జ‌గ‌న్ రెడ్డికి సొంత పార్టీ నేత‌ల వ్య‌వ‌హార శైలి త‌ల‌నొప్పిగా మారిన‌ట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ నేత‌లు గ్రూపు రాజ‌కీయాలు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఒక‌రిపై ఒక‌రు ఆధిప‌త్య ధోర‌ణి ప్ర‌ద‌ర్శిస్తూ నియోజ‌క‌వ‌ర్గాల్లో పెత్త‌నం చెలాయించాల‌ని చూసిన పార్టీ నేత‌ల‌కు గ‌తంలో హెచ్చరించినా వారి వ్య‌వ‌హారంలో ఏ మార్పు రాక‌పోవ‌డంతో సీఎం జ‌గ‌న్ సైతం ఏం చేయాల‌ని ఆలోచిస్తున్న‌ట్టు తెలుస్తోంది.


 దీంతో పాటు పార్టీలో రోజురోజుకు అసంతృప్తుల సంఖ్య కూడా పెరిగిపోతుండ‌డం. రాబోయే ఎన్నిక‌ల్లో త‌మ‌కు టికెట్ ల‌భించేలా ఇప్ప‌టినుంచే నేత‌లు ఆయా నియోజ‌క‌వ‌ర్గాలు ప్ర‌య‌త్నాలు మొద‌లు పెడుతూ.. ప్ర‌స్తుతం ఉన్న ఎమ్మెల్యేల‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డంతో గ్రూపు రాజ‌కీయాలు భ‌య‌ట‌ప‌డుతున్నాయి. సీఎం జ‌గ‌న్‌కు స‌న్నిహితురాలైన న‌గ‌రి ఎమ్మెల్యే రోజా కూడా గ్రూపు రాజ‌కీయాల‌ను ఎదుర్కొంటున్నారు. త‌న నియోజ‌వ‌ర్గంలో సొంత పార్టీలోని అసమ్మ‌తి వ‌ర్గం త‌న‌పై  పైచేయి సాధించాల‌ని చూడ‌డం, త‌న‌కు వ్య‌తిరేకంగా ఉన్న రెండు, మూడు గ్రూపులు క‌లిసి  త‌న‌ను ఎదుర్కోవాల‌ని చూడ‌డం రోజాకు తీవ్ర ఆగ్ర‌హాన్ని క‌లిగిస్తున్న అంశాలు మారాయి.


  న‌గ‌రి నియోజ‌వ‌ర్గంలో రోజా ప్ర‌త్య‌ర్థివ‌ర్గం ఆమెను టీడీపీకి చెందిన నేత‌గానే ప్ర‌చారం చేస్తున్నాయి.ఈ నెల 21న సీఎం జ‌గ‌న్ పుట్టిన రోజు ఉండ‌డంతో రోజా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మ‌రోప‌క్క ప్ర‌త్య‌ర్థి వ‌ర్గం విడిగా జ‌గ‌న్ జ‌న్మ‌దిన వేడుకలు నిర్వ‌హించ‌డానికి ఏర్పాట్టు చేసుకుంటున్నాయి. అలాగే, రాజ‌మండ్రి ఎంపీ మార్గాని భ‌ర‌త్‌.. రాజాన‌గ‌రం ఎమ్మెల్యే జ‌క్కంపూడి రాజా మ‌ధ్య కొన్ని రోజులుగా తీవ్ర విభేదాలు కొన‌స‌గుతున్నాయ‌ని ప్ర‌చారం న‌డుస్తోంది.  దాదాపు రాష్ట్రం మొత్తం ఇలాంటి గ్రూపు పాలిటిక్స్ న‌డుస్తున్నాయ‌ని తెల‌స్తోంది. దీంతో పంక పార్టీలో 2024 ఎన్నిక‌ల వ‌ర‌కు మ‌రింత అసంతృప్త నేత‌లు, గ్రూపు రాజ‌కీయాలు తీవ్రత‌రం అయి జ‌గ‌న్‌కు కష్టంగా మారుతుంద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. అయితే, ఈ ప‌రిస్థితుల‌పై జ‌గ‌న్ ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటారో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: