రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్. ఎస్. ఎస్ ) అంటేనే హిందూత్వవాద భావజాలాన్ని ప్రచారం చేసే సంస్థగా పేరుంది. అందుకు తగ్గట్లే సనాతన హిందూ ధర్మ సంప్రదాయాలను బోధిస్తుంది మరియు ప్రోత్సాహిస్తుంది. ఈ సంస్థకు అనుభంధంగా ఉండే విద్యాసంస్థల్లో సైతం భోధన ఇలాగే జరుగుంతుంది అనేది లోకవిధితమే .  అలాంటి సంస్థ యొక్క విద్యావిభాగం విద్యాభారతి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా  నడుస్తున్న సరస్వతి శిశు  మందిర్ స్కూళ్లలో మైనారిటీలు అయిన ముస్లిం , క్రిస్టియన్ మతాలకు చెందిన విద్యార్థులు అధిక సంఖ్యలో చేరుతున్నారు.

ఒక ప్రముఖ సంస్థ నిర్వహించిన సర్వే లో  కరోనా తరువాత నుంచి  మైనారిటీ  వర్గాలకు చెందిన విద్యార్థులు ఈ స్కూళ్ళోలో చేరుతున్నారు. కేవలం ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లోనే వీరి సంఖ్య 30 శాతానికి పెరిగినట్లు  సర్వేలో పేర్కొన్నది . అంతేకాకుండా  గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు చేరుతున్నారు అందులోనూ ముఖ్యంగా బాలికలు అధిక సంఖ్యలో చేరుతున్నారు.

ఈ విద్యార్థులు కేవలం చదువు వరకే పరిమితం కాకుండా స్కూళ్ళోలో సాంస్కృతిక కార్యక్రమాల్లో, క్రీడలలో  సైతం క్రియశీలకంగా పాల్గొంటున్నారు. ఈ   సరస్వతి శిశు  మందిరాలలో రానున్న రోజుల్లో వీరి సంఖ్య ఇంకా పెరగవచ్చునని ఆ సర్వే వెల్లడించింది.

ఈ స్కూళ్ళ ను స్థాపించింది   ఆర్ . ఎస్. ఎస్  మరియు జనసంఘ్ లలో కీలకంగా వ్యవహరించిన భారత రత్న నానజీ దేశ ముఖ్ గారు. ఉత్తరప్రదేశ్ లో  ఆర్.ఎస్.ఎస్ భాద్యతలు నిర్వహిస్తున్న నానాజీ దేశముఖ్ గారు ఆర్. ఎస్. ఎస్ అధినేత  గురూజీ గారి  ఆదేశాల మేరకు 1952 లో గోరఖ్ పూర్ పట్టణంలో మొదటి మందిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది . ప్రస్తుతం ఈ స్కూళ్ళు దేశవ్యాప్తంగా 10,000 వరకు ఉన్నాయి. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ స్కూళ్ళు గణనీయమైన సంఖ్యలోనే ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: