వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ ఎవరూ అని ఎవరిని ప్రశ్నించినా సరే... ఠక్కున వచ్చే సమాధానం ఆర్కే రోజా. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లో ఆరంగేట్రం చేసిన రోజా... 2009 ఎన్నికల్లో తొలి సారి చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత అనూహ్యంగా నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక నాటి నుంచి వైఎస్ జగన్ వెంటే నడుస్తున్నారు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు కూడా. దూకుడు ఉన్న నేతగా గుర్తింపు తెచ్చుకున్న రోజా... గత అసెంబ్లీలో అధికార పార్టీ నేతలపై, మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేసి... సస్పెన్షన్‌కు కూడా గురయ్యారు. దీనిపై న్యాయ పోరాటం చేసినప్పటికీ... పెద్దగా ఫలితం లేకుండా పోయింది.

అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రోజాకు మొదటి విడతలోనే మంత్రి పదవి వస్తుందని అంతా భావించారు కూడా. చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా పేర్లు మంత్రుల జాబితాలో విస్తృతంగా ప్రచారం జరిగింది కూడా. కానీ అనూహ్యంగా రోజాను పక్కన పెట్టారు వైఎస్ జగన్. రెండో విడతలో తప్పకుండా అవకాశం వస్తుందని కూడా చెప్పేశారు. అదే సమయంలో ఏపీఐఐసీ ఛైర్మన్‌గా రోజాకు అవకాశం కల్పించారు కూడా. ఇక ఇప్పుడు మంత్రివర్గ విస్తరణకు సమయం దగ్గర పడుతోంది. రెండో విడతలో ఖాయమని అంతా భావిస్తున్నారు. కానీ ఇప్పుడు సమీకరణాలు పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తున్నాయి. నగరిలో హ్యాట్రిక్ విజయం ఖాయమని రోజా వర్గం భావిస్తుంటే... పార్టీలో మాత్రం మరో రకమైన ప్రచారం జరుగుతోంది. నగరిలో రోజా పట్టుకోల్పోయినట్లు తెలుస్తోంది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మార్పు వచ్చింది. ఇందుకు ప్రధానంగా పార్టీ కార్యక్రమాల కంటే కూడా... ఇతర వ్యాపకాలపై రోజా ఎక్కువగా ఫోకస్ పెట్టారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఓ వైపు నగరి నియోజకవర్గంలో రోజాకు వ్యతిరేకంగా నిరసనలు జోరుగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే  వివాదంలో ఎవరిది పై చెయ్యి అవుతుందో చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: