రాయలసీమలో తెలుగుదేశం పార్టీ తీవ్ర కష్టాలు ఎదురుకుంటుంది...అబ్బే ఈ మాట ప్రత్యేకంగా చెప్పాల్సిన పని ఏముంది...మొదట నుంచి సీమలో టీడీపీ కష్టాలు ఎదురుకుంటూనే ఉంటుందని రాజకీయ విశ్లేషకుల నుంచి సమాధానాలు వస్తాయి. ఎందుకంటే సీమ అంటేనే టీడీపీకి కలిసి రాని ప్రాంతం...కాకపోతే సీమలో ఒక్క అనంతపురం మాత్రమే టీడీపీకి కలిసొచ్చే జిల్లా. మిగిలిన కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో టీడీపీకి పెద్ద పట్టు లేదు.

ఆ విషయం గత రెండు ఎన్నికల ఫలితాలని చూస్తే ఈజీగా అర్ధమవుతుంది. సరే ఆ రెండు ఎన్నికలు వదిలేస్తే...ఈ సారి మాత్రం సీమలో సత్తా చాటాలని టీడీపీ నేతలు తెగ కష్టపడుతున్నారు. ఇటు చంద్రబాబు కూడా సీమలో పార్టీని లేపడానికి నానా కష్టాలు పడుతున్నారు. అయితే పూర్తి స్థాయిలో మాత్రం పార్టీని పుంజుకునే విధంగా తీసుకెళ్ళడం లేదు. చాలా చోట్ల టీడీపీకి బలమైన నాయకులని పెట్టలేకపోతున్నారు. ఇప్పటికే వైసీపీకి అన్నీ నియోజకవర్గాల్లో బలమైన నాయకులు ఉన్నారు.

అలా బలంగా ఉన్న నాయకులని ఢీకొట్టాలంటే టీడీపీలో కూడా స్ట్రాంగ్ నాయకులు ఉండాలి. కానీ పలు స్థానాల్లో టీడీపీకి ఆ స్థాయి నాయకులు మాత్రం లేరు. ముఖ్యంగా పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ పరిస్తితి మరీ దారుణం. మొదట నుంచి అనంత తప్ప..మిగిలిన జిల్లాల పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ పెద్దగా గెలిచిన దాఖలాలు లేవు. ఇప్పటికే గెలిచే స్థాయికి టీడీపీ ఎదగలేదు.

అసలు చెప్పాలంటే కొన్ని స్థానాల్లో టీడీపీకి నాయకులు కూడా లేరు. అనంత, కర్నూలు జిల్లాల్లో కనీసం పార్లమెంట్ స్థానాల్లో నాయకులు ఉన్నారు గానీ...కడప, చిత్తూరు స్థానాల్లో మాత్రం లేరు. కడప జిల్లాలో...రాజంపేట, కడప పార్లమెంట్ స్థానాల్లో టీడీపీకి నాయకులే లేరు. ఇప్పటికీ నాయకులని పెట్టలేదు. అటు చిత్తూరులో..తిరుపతి, చిత్తూరు స్థానాల్లో కూడా టీడీపీకి నాయకులు లేరు. తిరుపతిలో ఓడిపోయిన పనబాక లక్ష్మీ మళ్ళీ అడ్రెస్ లేరు. మొత్తానికైతే కడప చిత్తూరు జిల్లాల్లోని పార్లమెంట్ స్థానాల్లో టీడీపీకి పెద్దగా క్లారిటీ లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: