అసంఘ‌టిత రంగంలో ప‌ని చేస్తున్న ప్ర‌జ‌ల‌కు ఆర్థిక భ‌ద్ర‌త క‌ల్పించేందుకు ప్ర‌భుత్వం ఈ సంవ‌త్స‌రం ఈ శ్ర‌మ్ పోర్ట‌ర్‌ను ప్రారంభించిన‌ది. అయితే నిజానికి అసంఘ‌టి రంగంలో ప‌ని చేస్తున్న వారి గురించి స‌మాచారం పొంద‌డ‌మే ప్ర‌భుత్వ ప్ర‌ధాన ల‌క్ష్యం. దీంతో పాటు ప్ర‌భుత్వ ప‌థ‌కాల ఫ‌లాల‌ను వారికి అందించాల‌నేది ప్ర‌భుత్వ మ‌రొక ల‌క్ష్యం. ఈ శ్రామ్ కార్డు కింద కార్మికులు ఈ ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను సుల‌భంగా యాక్సెస్ చేయడంతో పాటు వాటిని స‌ద్వినియోగం చేసుకోవ‌చ్చు. ఈ ప‌థ‌కాన్ని ఎవ‌రూ స‌ద్వినియోగం చేసుకుంటార‌నేది ప్ర‌జ‌ల మ‌దిలో మెదులుతున్న ప్ర‌శ్న‌..?

ఈ-శ్రామ్ కార్డు అనేది ప్ర‌భుత్వం జారీ చేసిన ప్ర‌త్యేక కార్డు.. ఇది అంఘ‌టిత రంగంలో ప‌ని చేస్తున్న ప్ర‌జ‌ల‌కు ప్ర‌యోజ‌నం చేకూరుస్తూ ఉంది. ఈ ప‌థ‌కం ప్ర‌యోజ‌నాన్ని పొంద‌డానికి, అసంఘ‌టిత రంగ కార్మికులు eshram.gov.in వెబ్ సైట్ లోఈ శ్రామ్ కు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా నమోదు చేసుకోవాలి. ఆ త‌రువాత ఈ-శ్రమ్ కార్డు  పొందుతారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు అనేక పథకాలు ప్రారంభిస్తున్నప్పటికీ.. చాలా మంది వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు.  ఇక నుంచి అలా జ‌ర‌గ‌దు, ఎటువంటి హడావిడి లేకుండా ఈ-శ్రమ్ కార్డును సద్వినియోగం చేసుకోవచ్చు.

ముఖ్యంగా ESIC లేదా EPFO ఉద్యోగి కాని కార్మికుడిని అసంఘటిత కార్మికుడుగా పేర్కొంటారు. అయితే అసంఘ‌టిత రంగానికి చెందిన కార్మికులు ఈ-శ్ర‌మ్ ఫోర్ట‌ల్‌లో న‌మోదు చేసుకుంటే.. వారికి రూ.2ల‌క్ష‌లు ప్ర‌మాద బీమా సౌక‌ర్యం  వ‌స్తుంది.  వాస్త‌వానికి రిజిస్ట‌ర్ కార్మికుడు ప్ర‌మాదానికి గురైతే.. మ‌ర‌ణం లేదా అంగ‌వైక‌ల్యం సంభ‌వించిన‌ట్ట‌యితే అత‌నికి రూ.2ల‌క్ష‌లు బీమా సంస్థ‌నే చెల్లిస్తుంది. కార్మికుడు పాక్షికంగా అంగ‌వైక‌ల్యం పొందితే.. అప్పుడు అత‌నికీ ఈ ప‌థ‌కం కింద ల‌క్ష రూపాయ‌లు ల‌భిస్తాయి.

ప్ర‌ధాన‌మంత్రి శ్ర‌మ యోగి మాన్ ధ‌న్ యోజ‌న‌, స్వ‌యం ఉపాధి పొందే వారికి జాతీయ పెన్ష‌న్ ప‌థ‌కం.. ప్ర‌ధాన మంత్రి జీవ‌న్ జ్యోతి బీమా యోజ‌న‌, ప్ర‌ధాన‌మంత్రి సుర‌క్ష బీమా యోజ‌న‌, ప్ర‌జా పంపిణీ వ్య‌వ‌స్థ అట‌ల్  పెన్ష‌న్ యోజ‌న‌, ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న‌, అసంఘ‌టిత రంగ కార్మికుల కోసం శ్ర‌మ్ కార్డు జాతీయ సామాజిక సహాయ ప‌థం, ఆయుష్మాన్ భార‌త్, ప్ర‌ధాన‌మంత్రి కౌశ‌ల్ వికాస్ యోజ‌న‌, ప్ర‌ధాన‌మంత్రి ఉపాధి క‌ల్ప‌న ప‌థ‌కాల ప్ర‌యోజ‌నాలు అందుబాటులోకి వ‌స్తుంటాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: