ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డికి విదేశీ ప్రయాణాలు చేసింది చాలా అరుదు. గతంలో ప్రజాప్రతినిధులు చాలా మంది ప్రభుత్వ నిధులతో విదేశీ ప్రయాణాలుచేశారు. కానీ వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి అందుకు విరుద్ధం.  వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించన తరువాత కానీ, ముఖ్యమంత్రి అయన తరువాత కానీ ఆయన అధికారికంగా  సెలవు తీసుకున్న రోజులు, విదేశీ పర్యటనలను వేళ్లమీది లెక్కించ వచ్చు.
ఆయన ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో అంటే 2017 ఒక సారి న్యూజీలాండ్ వెళ్లారు. అప్పడు ఆయన మీద ఉన్న కేసుల హడావిడి నడుస్తోంది.ఆయన బెయిల్ రద్దు చేయాలని సిబిఐ  కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. అంతేకాకుండా ఆయన విదేశాలకు వెళితే మరలా తిరిగి భారత్ కు రారు అని కూడా సిబిఐ తన పిటీషన్ లో పేర్కోనడం విశేషం.  అయితే కోర్టు ఆయన విదేశీ యానానికి  గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొద్ది రోజులు ఆయన కుటుంబ సభ్యులతో గడిపి  ఆ తరువాత భారత్ వచ్చారు.
వై.ఎస్ కుటుంబానానికి  జరూసలేమ్ అంటే మహా ప్రీతి. ఏ మాత్రం సమయం దొరికినా వై.ఎస్ కుటుంబం  ఇక్కడికి వెళుతుంటారు. ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్  మోహన్ రెడ్డి కూడా అదే కుటుంబ సంప్రదాయాన్ని పాటించారు.  గతంలో ఎన్నో మార్లు ఆక్కడికి వెళ్లినా సిఎంగా పదవీబాధ్యతలు స్వీకరించార విధులకు సెలవు తీసుకుని కుటుంబంతో సహా అక్కడి వెళ్లి వచ్చారు. ఆ తరువాత  ఆయన 2019 ప్రాంతంలో అనుకుంటా ఓ సారి స్విట్జర్ ల్యాండ్ వెళ్లారు. కుటుంబంతో గడిపారు.  అయితే  రాష్ట్ర ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకునే జగన్ మోహన్ రెడ్డి తన ఇజ్రాయిల్ పర్యటనలో అక్కడ ఉప్పునీటిని మంచి నీరుగా మార్చే ప్రాంతాన్ని పరిశీలించారు.  సముద్రపు ఉప్పు నీటిని మంచి నీరుగా మార్చి , కరవుతో ఇబ్బందులు పడుతున్న రాయలసీమ ప్రాంతానికి  అందిస్తే ఎలా ఉంటుందనే విషయమే ఆలోచనలు చేశారు. సాధ్యాసాధ్యాలను కూడా అక్కడి వారితో చర్చించారు.
ప్రపంచంపై కరోనా పడగ విప్పి తాండవం చేస్తున్న నేపథ్యంలో ఆయన హాలిడే ట్రిప్ కాస్తా... స్వదేశీ ట్రిప్ అయింది. ఈ  దఫా ఉత్తర భారత దేశంలోని పర్యాటక ప్రాంతం సిమ్లా లో తన కుటుంబంతో గడిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: