సినీ హీరో పవన్ కల్యాణ్‌కు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాజకీయంగా సక్సెస్ కాకపోవచ్చు గానీ...ప్రజలని ఆకర్షించడంలో మాత్రం ముందే ఉన్నారు. ఆయనని చూడటానికే జనం ఎగబడిపోతారు. అయితే అలా క్రేజ్ ఉన్న పవన్ పరువుని వైసీపీ మంత్రులు ఎప్పటికప్పుడు తీసేస్తూ వస్తున్నట్లు కనిపిస్తోంది. పేర్ని నాని, కొడాలి నాని, కన్నబాబు, అంబటి రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్ లాంటి వారు పవన్‌పై సెటైర్లు వేస్తూ విమర్శలు చేస్తూ ఉంటారు.

తాజాగా కూడా కొడాలి నాని...పవన్‌పై సెటైర్లు వేశారు. అసలు పవన్ తమకు సలహాలు ఇవ్వడం ఏంటని ఫైర్ అయిపోయారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ విషయంలో కేంద్రం వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని పవన్ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో పవన్ తమ పార్టీని డిమాండ్ చేసే బదులు డైరక్ట్‌గా బీజేపీతోనే మాట్లాడుకోవచ్చుగా అని కొడాలి కౌంటర్ ఇచ్చారు.

తాము చేసేది ఏదో చేస్తున్నామని, దానికి పవన్ సలహాలు అవసరం లేదని, అయిన తమ సలహాదారుడు పీకే(ప్రశాంత్ కిషోర్) అని, ఈ పీకే(పవన్ కల్యాణ్) కాదని అన్నారు. ఒకవేళ ఈయనే పీకే అని ఊహించుకుని సలహాలు ఇచ్చేస్తున్నారేమో అని అన్నారు. అలాగే ఏపీలో పవన్‌కు పెద్ద సీన్ లేదని, తాము అధికార పక్షం...టీడీపీ ప్రతిపక్షం అని...మరి ఏ పక్షం అని సెటైర్ వేశారు..అలాగే గాజు గ్లాసు ఎప్పుడో పగిలిపోయిందని మాట్లాడారు.

అంటే ఏపీ రాజకీయాల్లో పవన్‌కు అంత సీన్ లేదన్నట్లు మాట్లాడారు. దీనిపై జనసైనికులు గట్టిగానే స్పందిస్తున్నారు. తమ సత్తా ఏంటో వచ్చే ఎన్నికల్లో చూపిస్తామని అంటున్నారు. అయితే కొడాలి చెప్పినట్లు ఇప్పుడు ఏపీలో జనసేనకు పెద్ద బలం కనిపించడం లేదు. ఆ పార్టీకి సింగిల్‌గా నాలుగైదు సీట్లు రావడం కష్టమనే పరిస్తితి. అందుకే కొడాలి సైతం ఆ స్థాయిలో మాట్లాడినట్లు తెలుస్తోంది.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: