రాజకీయాల్లో కాన్ఫిడెన్స్ ఉండొచ్చు గానీ..ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు...ఎప్పుడైతే ఓవర్ కాన్ఫిడెన్స్‌కు వెళ్తారో అప్పుడు ఇబ్బందులు పడక తప్పదు. అయితే ఇప్పుడుప్పుడే ఏపీ రాజకీయాల్లో టీడీపీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుందనే చెప్పాలి. గత ఎన్నికల్లో ఓటమి నుంచి పార్టీ చాలావరకు బయటపడి...పలు నియోజకవర్గాల్లో పికప్ అవుతుంది. ఇలాంటప్పుడు మరింత కష్టపడి పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత కార్యకర్తలది.

కానీ వారేమో ఇంకా జగన్ పాలన పట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు...ఇంకా తమని ప్రజలు గెలిపించేస్తారనే ధీమాలో తెలుగు తమ్ముళ్ళు ఉన్నారు. అసలు జగన్ పాలన వల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని, ఇంకా వారు చంద్రబాబు ఉంటే బాగుండేది అని అనుకుంటున్నారని, నెక్స్ట్ ఎలాగైనా బాబుని గెలిపించుకోవాలని చూస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. పైగా పలు సర్వేలు పేరుతో టీడీపీదే అధికారం అంటూ ప్రచారం హోరెత్తిస్తున్నారు.

ఇటీవల ప్రశాంత్ కిషోర్ సర్వే చేశారని...ఆ సర్వేలో టీడీపీకి 120పైనే సీట్లు వస్తాయని తేలిందని, ఇంకా పార్టీకి తిరుగులేదని తమ్ముళ్ళు హడావిడి చేస్తున్నారు. ఇలా తమ్ముళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ప్రచారం చేసుకుంటున్నారు. అసలు ఆ సర్వే నిజమా? కాదా? అనే విషయాన్ని మాత్రం చెక్ చేసుకోవడం లేదు. ఏదో గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఇంకా తమకు తిరుగులేదని చెప్పేసుకుంటున్నారు.

గతంలో అలాగే అధికారంలో ఉండగా...చంద్రబాబుకు 70 శాతం ప్రజల మద్ధతు ఉందని, ఇంకా బాబుకు తిరుగుండదని, మరో 15 ఏళ్ల పాటు సీఎంగా ఆయనే కొనసాగుతారని హడావిడి చేశారు. అటు టీడీపీ నేతలు కూడా తెగ డప్పు కొట్టారు. అసలు జగన్‌కు ఇంకా సీఎం అయ్యే యోగ్యం లేదని, రాష్ట్రం పసుపు పచ్చగా అయిపోతుందని కలలు కన్నారు. చివరికి 2019 ఎన్నికల్లో ఏం జరిగిందో తెలిసిందే. అయినా సరే తమ్ముళ్ళు మారడం లేదు. ఇప్పుడు కూడా తమకు తిరుగులేదే అని మాట్లాడుకుంటున్నారు. ఇలా ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ముందుకుపోతే మళ్ళీ బొక్కబోర్లా పడక తప్పదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: