రాజకీయ చరిత్రలో ఆయనది మరో ప్రస్థానం, ప్రజల ప్రేమను దక్కించుకున్న ఘనత ఆయన సొంతం, పాలనా యంత్రాంగంలో సరికొత్త మార్పులు తీసుకొచ్చి బడుగు, బలహీన వర్గాలకు బలం అందించిన మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆయన తనయుడిగా రాజకీయ రంగంలోకి అడుగు పెట్టి తండ్రి ఆశయాలకు ప్రతీకగా నిలిచిన మన వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మహనీయుడు, గొప్ప రాజకీయ నాయకుడి తనయుడు జగన్ గురించి ఇపుడు కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు. అలా చిన్న తనం నుండే జగన్ గారిలో నాయకుడి లక్షణాలు పుష్కలంగా ఉండేవట, సహాయం అందించే చేయిగా చిన్నతనం నుండే ఆయనకు మంచి పేరుంది.

వైఎస్ జగన్ చిన్నతనం నుండే తోటి  వారికి సహాయం చేయాలనే ఆలోచనలు, ప్రత్యేకమైన ఆలోచన విధానం కళ్ళకు కట్టినట్టు కనిపించేవట.  జగన్ గారు 1972 లో పులివెందులలో జన్మించారు. అందుకే ఈయనని రాయలసీమ ముద్దుబిడ్డ అని పిలుస్తుంటారు.  ప్రాథమిక అభ్యాసం అంతా అక్కడే జరిగింది, ఆ తర్వాత 12 వ తరగతి హైదరాబాద్, బేగంపేట్ లోని పబ్లిక్ స్కూల్లో అభ్యసించారు.  అనంతరం నిజాం కాలేజీలో బీకాం లో చేరి డిగ్రీ పట్టా పొందారు. ఆ తర్వాత పై చదువులు కోసం లండన్ వెళ్ళారు. కానీ  కొన్ని కారణాల వలన అక్కడ చదువు మధ్యలోనే ఆపి తిరిగి వచ్చేశారు. 1996 లో ఆయనకి 24 ఏళ్ల వయసులో డాక్టర్ గంగి రెడ్డి కుమార్తె భారతితో వివాహం అయ్యింది.

వీరికి ఇద్దరు కుమార్తెలు పెద్ద కూతురు వర్ష రెడ్డి, చిన్న కుమార్తె హర్ష రెడ్డి కాగా, పెద్ద కుమార్తె  వర్ష లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో సీటును  సంపాదించి విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారు. అప్పట్లో ఈ విషయం సంచలనంగా మారింది. రాజకీయాలకు రాక ముందు వై ఎస్ జగన్ బెంగుళూరు లోని లాంకో హిల్స్ లో వర్క్ చేశారు. ఓ వైపు బిజినెస్ పరంగా బిజీగా ఉంటూనే  2009 లో కడప ఎం.పీ గా పోటీ చేసి విజయాన్ని అందుకున్నారు. అలా ఆయన రాజకీయ ప్రస్థానం మొదలయ్యింది. సొంత పార్టీ తో  70 సీట్లు సాధించిన ఘనత కీర్తి ప్రతిష్టలు దివంగత నటుడు, నేత ఎన్ఠీఆర్ తర్వాత జగన్ గారికే దక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి: