ఇప్పటికే కరోనా వైరస్ తో ప్రపంచ దేశాలు అల్లాడి పోయాయి. ఇలాంటి సమయంలో వెలుగులోకి వస్తున్న కొత్త వేరియంట్లు ప్రపంచ దేశాలను మళ్లీ భయం లోకి నెడుతున్నాయి అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అగ్ర రాజ్యాలుగా ఉన్న బ్రిటన్ అమెరికా లాంటి దేశాల్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజు రోజుకి భారీగా పెరిగి పోతూ ఉండటం ఆందోళనకరంగా మారిపోయింది. ఇలాంటి సమయంలోనే అటు కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కేసులు కూడా పెరిగిపోతుండటం అందరిని మరింత భయపెడుతుంది అయితే ఓమిక్రాన్ వైరస్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు మరియు కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకు వస్తున్నాయి..


 ఎక్కడ ఓమిక్రాన్ విషయంలో అవకాశం తీసుకోకూడదు అని ప్రస్తుతం అన్ని దేశాల ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే ఎన్నో దేశాలలో కఠిన ఆంక్షలు అమలులోకి రాగా కొన్ని ప్రాంతాలలో అయితే ఏకంగా లాక్ డౌన్  విధిస్తున్న పరిస్థితులు కూడా వస్తున్నాయి. అంతే కాకుండా కొన్ని దేశాలకు రాకపోకలపై కూడా నిషేధం విధిస్తూ ఉండటం గమనార్హం . ఈ క్రమంలోనే ఇటీవలే అమెరికా పైన మిత్ర దేశమైన ఇజ్రాయిల్ నిషేధం విధించినట్లు తెలుస్తోంది. అమెరికా ఇజ్రాయెల్ మధ్య రాకపోకలపై పూర్తిస్థాయి నిషేధం విధిస్తున్నట్లు ఇటీవల ఇజ్రాయిల్ ప్రభుత్వం ప్రకటించింది.



 అమెరికా నుంచి వచ్చేటువంటి రెగ్యులర్ ప్యాసింజర్ విమానాలపై నిషేధాన్ని విధిస్తూ ఇటీవల ఇజ్రాయిల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.. అయితే అటు భారత్ కూడా ఇలాంటి నిషేధాజ్ఞలను కొనసాగిస్తూ ఉండటం గమనార్హం.. సౌత్ఆఫ్రికా నుంచి భారత్కు వచ్చే ప్రయాణికులతో పాటు.. ఇక ఓమిక్రాన్ వైరస్ కేసులు ఎక్కువగా ఉన్న 14 దేశాల పై కూడా రాకపోకలను నిషేధిస్తూ భారత్ నిర్ణయం తీసుకుంది. ఇలా ఓమిక్రాన్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అన్ని దేశాలు కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకు వస్తూ మళ్ళీ లాక్‌డౌన్‌ లోకి వెళ్ళి పోతున్నాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: