రాష్ట్ర రాజకీయాల్లో గతంలో ఎప్పుడూ లేనట్లుగా ఇపుడు పీకేల గోలమొదలైంది. ఇంతకీ పీకేలు అంటే ఏమిటి ? ఎంతమందున్నారో  తెలుసా ? రాష్ట్ర రాజకీయాల్లో ఇద్దరు పీకేలున్నారు. వారిలో మొదటి పీకే అంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఇక రెండో పీకే అంటే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. ఈ పీకేల విషయాన్ని తెరమీదకు తెచ్చింది మంత్రి కొడాలి నాని. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ విషయమై తామేం చేయాలో మా పీకే చూసుకుంటారు..జనసేన ఏమి చేయాలో ఆ పీకే చూసుకోవాలన్నారు.




ఇక్కడ మా పీకే అంటే ప్రశాంత్ కిషోర అనర్ధం. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున రాజకీయ వ్యూహకర్తగా పీకే పనిచేసిన విషయం తెలిసిందే. ఇపుడు కూడా అవసరార్ధం పార్టీకి సేవలు అందిస్తున్నాడు. పీకే వ్యూహాల వల్ల పార్టీకి ఎంతోకొంత మేలు జరిగిందనేది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి విషయాన్ని వదిలేసినా రాజకీయ వ్యూహకర్తగా దేశంలో పీకే ఎంత పాపులరో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. రాజకీయ వ్యూహకర్త పీకే క్రెడిట్ ఈ స్ధాయిలో ఉంటే మరి జనసేన అధినేత పవన్ కల్యాణ్ (పీకే) పరిస్దితి ఏమిటి ?




జనసేన పార్టీ పెట్టిందగ్గర నుండి ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ఎదుగుదల కనబడనేలేదు. ఏ విషయం మీద కూడా స్ధిరమైన అభిప్రాయం లేకపోవటం మైనస్సే. పైగా జగన్ అంటే నిలువెల్లా మండిపోయే ఈ పీకే ఎంతకాలమైనా నెగిటివ్ రాజకీయాలే చేస్తుంటారు. తన రాజకీయ జీవితంలో ఇప్పటివరకు జగన్ను టార్గెట్ చేయటంతోనే సరిపోతోంది. రెండుచోట్ల పోటీచేసి రెండుచోట్లా ఓడిపోయిన మొట్టమొదటి పార్టీ అధినేతగా పీకే రికార్డు సృష్టించారు.




లాజికల్ గా చూస్తే ఈ పీకేకి రాజకీయాల్లో పెద్ద సీన్ కూడా కబడటంలేదు. ప్రశ్నించేందుకే పార్టీని పెట్టానని చెప్పిన పీకే చంద్రబాబు అధికారంలో ఉన్నంత కాలం జగన్నే టార్గెట్ చేశారు. ఒక ప్రతిపక్ష పార్టీ మరో ప్రతిపక్ష పార్టీని టార్గెట్ చేయటం ఏపీలో తప్ప  దేశంలో మరెక్కడా జరగలేదు. అలాగే కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన అంశాల్లో కూడా మన పీకే ఇపుడు జగన్నే టార్గెట్ చేస్తుండటమే విచిత్రంగా ఉంది. ఈ విషయంలోనే కొడాలి మాట్లాడుతు పీకేల గోలపై క్లారిటి ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: